sahanamvande@gmail.com

బహుజనుల బలిదానంతో అమరావతి

సహనం వందే, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి… ఇది రాజధాని కాదు, రాజకీయ నాయకుల కుట్రలకు, అక్రమాలకు నిలువెత్తు నిదర్శనం! 2015లో వేసిన అబద్ధపు పునాదులపై ఇప్పుడు వచ్చే నెల 2వ తేదీన మరోసారి శంకుస్థాపన డ్రామాకు తెరలేపుతున్నారు. చంద్రబాబు నాయుడు ఆడుతున్న ఈ రాజకీయ నాటకంలో ప్రజల ఆశలు మాత్రమే కాదు, బడుగు బలహీన వర్గాల జీవితాలు కూడా బలి అవుతున్నాయి. మొదటి శంకుస్థాపనతో వేల కోట్ల ప్రజాధనం స్వాహా అయిన తర్వాత ఇప్పుడు మళ్లీ…

Read More

బీహార్ బుల్డోజర్

సహనం వందే, పాట్నా: జైపూర్‌లోని సవాయి మాన్‌సింగ్ స్టేడియం వేదికగా 14 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2025లో చరిత్ర సృష్టించాడు. కేవలం 35 బంతుల్లోనే మెరుపు శతకం బాది, క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు. రాజస్థాన్ రాయల్స్ తరపున బరిలోకి దిగిన ఈ బీహార్ బుల్డోజర్… గుజరాత్ టైటాన్స్ బౌలర్లపై 11 సిక్సర్లు, 7 ఫోర్లతో విరుచుకుపడ్డాడు. ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యంత వేగవంతమైన సెంచరీ వీరుడిగా నిలిచిన వైభవ్ వెనుక ఎన్నో త్యాగాలు, కఠోర…

Read More

అమెజాన్ వర్సెస్ అమెరికా

సహనం వందే, వాషింగ్టన్: అమెరికా ఆన్‌లైన్ దిగ్గజం అమెజాన్‌తో వైట్ హౌస్ నేరుగా తలపడుతోంది. అమెరికా ప్రభుత్వం విధించిన టారిఫ్‌ల వల్ల ఉత్పత్తుల ధరలపై పడే అదనపు భారాన్ని తమ వెబ్‌సైట్‌లో వినియోగదారులకు చూపాలని అమెజాన్ యోచిస్తున్నట్లు వార్తలు రావడంతో వైట్ హౌస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్యను ‘శత్రుత్వపూరిత, రాజకీయ ప్రేరేపిత చర్య’గా అభివర్ణించింది. ఈ వివాదం అమెజాన్ షేర్ల పతనానికి దారితీసింది, టారిఫ్ విధానాలపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చను మరింత రాజుకుంది….

Read More

‘డెత్ క్యాప్’ మర్డర్

సహనం వందే, ఆస్ట్రేలియా: ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రంలో ఒక భయంకరమైన నేరం వెలుగు చూసింది. ఒక ఇల్లాలు తన రక్త సంబంధీకులకే విషం పెట్టి ముగ్గురి ప్రాణాలు తీసింది. మరొకరు చావు బతుకుల మధ్య ఎలాగో అలా బయటపడ్డారు. 50 ఏళ్ల ఎరిన్ ప్యాటర్సన్ అనే మహిళ పథకం ప్రకారం విషపూరితమైన పుట్టగొడుగులతో వండిన భోజనం వడ్డించి ఈ ఘాతుకానికి ఒడిగట్టింది. 2023 జూలైలో లియోంగాథాలో జరిగిన ఈ దారుణ ఘటనలో ఎరిన్‌పై మూడు హత్య కేసులు,…

Read More

హాస్యం ‘బ్రహ్మ’స్మి

సహనం వందే, సినిమా బ్యూరో, హైదరాబాద్: తెలుగు సినిమా హాస్యానికి బ్రహ్మానందం ఒక రారాజు. తెలుగు తెరపై మూడు దశాబ్దాలు వెలుగొందారు. రేలంగి, రాజబాబు వంటి హాస్య దిగ్గజాల వారసత్వాన్ని అందుకుని తనదైన శైలితో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. అయితే వయోభారం, అనారోగ్య సమస్యల కారణంగా ఆయన సినిమాల్లో నటించడం బాగా తగ్గిపోయింది. దీంతో తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఒకటే హాట్ టాపిక్… బ్రహ్మానందం తర్వాత ఆయన హాస్య వారసత్వాన్ని కొనసాగించేది ఎవరు? ఆయన స్థానాన్ని భర్తీ…

Read More

సింగర్ దేశద్రోహం

సహనం వందే హైదరాబాద్: పహల్గాంలో ఉగ్రదాడి ఘటనపై ప్రభుత్వాన్ని విమర్శిస్తూ భోజ్‌పురి గాయని నేహా సింగ్ రాథోడ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశద్రోహం కేసుగా మారాయి. ఆమె వ్యాఖ్యలు మత, కుల విద్వేషాలను రెచ్చగొడుతున్నాయని, పాకిస్తాన్‌లో వైరల్ అవుతూ భారత్‌కు వ్యతిరేకంగా ఉపయోగపడుతున్నాయని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. నేహా రాథోడ్ విమర్శలు… భగ్గుమన్న వివాదంపహల్గాం ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడంపై నేహా సింగ్ రాథోడ్ తీవ్రంగా స్పందించారు. ఈ దాడిని…

Read More

పహల్గాంలో హైటెక్ టెర్రరిజం

సహనం వందే, ఢిల్లీ: జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన దారుణమైన ఉగ్రదాడి కేవలం ఒక హింసాత్మక చర్య మాత్రమే కాదు, భారత భద్రతా వ్యవస్థపై జరిగిన సైబర్ దాడి! పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రమూకలు చైనా తయారీ శాటిలైట్ ఫోన్లు, నిషేధిత ఎన్‌క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్‌లను ఉపయోగించి తమ మారణకాండను సమన్వయం చేసుకున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తేల్చింది. ఈ హైటెక్ టెర్రరిజం వెనుక అంతర్జాతీయ శక్తులున్నాయని స్పష్టమవుతోంది. భారత భూభాగంలోకి చొరబడిన ఈ సైబర్ ఉగ్రవాదులు…

Read More

పిల్లలతో అసభ్యంగా ఏఐ చాట్‌బాట్‌

సహనం వందే హైదరాబాద్: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా రూపొందించిన కృత్రిమ మేధస్సు (ఏఐ) చాట్‌బాట్‌లు ఇప్పుడు పెద్ద వివాదంలో చిక్కుకున్నాయి. ఈ చాట్‌బాట్‌లు సరదా సంభాషణల కోసం తయారు చేసినా, ఇవి చిన్నారులతో సహా అందరు యూజర్లతో అసభ్యకరమైన, లైంగిక విషయాలు మాట్లాడుతున్నాయని కొత్తగా వెలుగులోకి వచ్చింది. మెటా ఏఐ అధికారిక చాట్‌బాట్‌తో పాటు యూజర్లు తయారుచేసిన చాలా చాట్‌బాట్‌లు లైంగిక చర్చలను ప్రోత్సహిస్తున్నాయి. ఇది పిల్లల భద్రతకు పెను ప్రమాదంగా మారుతోందని ఆందోళనలు…

Read More

తొలి మహిళా డాగ్ హ్యాండ్లర్ శ్రీలక్ష్మి

సహనం వందే, అస్సాం: భారత సైన్యంలోని ప్రతిష్టాత్మక అస్సాం రైఫిల్స్‌లో ఒక తెలుగు మహిళ చరిత్ర సృష్టించారు. రైఫిల్‌వుమన్ పీవీ శ్రీలక్ష్మి… ఈ పారామిలిటరీ దళం మొట్టమొదటి మహిళా డాగ్ హ్యాండ్లర్‌గా విజయవంతంగా శిక్షణ పూర్తి చేశారు. సాంప్రదాయకంగా పురుషుల ఆధిపత్యంలో ఉన్న ఈ కీలక విభాగంలో శ్రీలక్ష్మి తన అంకితభావం, ధైర్యంతో సరికొత్త అధ్యాయానికి నాంది పలికారు. అస్సాం రైఫిల్స్ స్వయంగా ఈ విషయాన్ని తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించడంతో, సోషల్ మీడియాలో ఆమె…

Read More

పాఠ్యపుస్తకాల్లో ‘మొఘలు’లకు మంగళం

సహనం వందే, ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఎన్సీఈఆర్టీ ఏడో తరగతి పాఠ్యపుస్తకాలను పూర్తిగా మార్చడం సంచలనంగా మారింది. ఈ పుస్తకాల్లో అనేక మార్పులు చేర్పులు చేశారు. నూతన పాఠ్య పుస్తకాల్లో మొఘల్ చక్రవర్తులు, ఢిల్లీ సుల్తానేట్‌కు సంబంధించిన సమస్త చరిత్రను తొలగించింది. ‘భూమి ఎలా పవిత్రమవుతుంద’నే కొత్త చాప్టర్ ను పొందుపరిచారు. ఈ చాప్టర్లో హిందూ, బౌద్ధ, సిక్కు, ఇస్లాం, క్రైస్తవ, జుడాయిజం, జోరాస్ట్రియన్ మతాలకు సంబంధించిన వివరాలు ఉంటాయి. అలాగే భారత్ సహా ఇతర దేశాల్లోని…

Read More