- విచారణకు రావాలని పోలీసుల ఆదేశం
సహనం వందే, హైదరాబాద్:
మేడ్చల్ సరోగసి కేసులో దర్యాప్తు వేగవంతం చేసిన పోలీసులు ఏడు ప్రైవేట్ ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు లక్ష్మి, ఆమె కుమారుడు నరేందర్‌రెడ్డి పలు ఆస్పత్రులకు ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నట్లు పేట్ బషీరాబాద్ పోలీసులు గుర్తించారు. సరోగసి ముసుగులో అక్రమాలకు పాల్పడుతున్న ఈ ముఠాకు సహకరించినట్లు అనుమానిస్తున్న హెగ్డే హాస్పిటల్, లక్స్ హాస్పిటల్, అను టెస్ట్ ట్యూబ్ సెంటర్, ఈవీఎఫ్ ఐవీఎఫ్ సెంటర్, ఫర్టి కేర్, శ్రీ ఫెర్టిలిటీ, అమూల్య ఫెర్టిలిటీ సెంటర్లకు నోటీసులు అందాయి. ఈ ఆస్పత్రుల యాజమాన్యాలు, వైద్యులు త్వరలో విచారణకు హాజరు కావాలని పోలీసులు ఆదేశించారు. ఈ కేసులో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.