44 మంది అరెస్ట్… ఉద్రిక్తత
సహనం వందే, లాస్ ఏంజిల్స్:
లాస్ ఏంజిల్స్ నగరంలో ఇమ్మిగ్రేషన్ రైడ్స్‌కు వ్యతిరేకంగా నిరసనలు తీవ్రరూపం దాల్చాయి. పరామౌంట్ ప్రాంతంలో హిస్పానిక్ జనాభా అధికంగా ఉండే చోట ప్రదర్శనకారులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు. లాస్ ఏంజిల్స్ టైమ్స్ నివేదిక ప్రకారం, కొందరు మెక్సికన్ జెండాలను ఊపగా, మరికొందరు అమెరికన్ జెండాను తగలబెట్టారు. ఫెడరల్ భవనం వెలుపల నినాదాలు మార్మోగాయి.
అరెస్టులు… ఘర్షణలు
శుక్రవారం లాస్ ఏంజిల్స్‌లోని పలు ప్రాంతాల్లో ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నిర్వహించిన రైడ్స్‌లో కనీసం 44 మందిని అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిలో సర్వీస్ ఎంప్లాయీస్ ఇంటర్నేషనల్ యూనియన్ -యునైటెడ్ సర్వీస్ వర్కర్స్ వెస్ట్ ప్రెసిడెంట్ డేవిడ్ హువెర్టా కూడా ఉన్నారు. ఈ రైడ్స్‌కు సమాంతరంగా పరామౌంట్ ప్రాంతంలో ప్రదర్శనకారులు, ఫెడరల్ ఏజెంట్ల మధ్య తీవ్ర ఘర్షణలు జరిగాయి. పరిస్థితిని నియంత్రించడానికి ఫ్లాష్-బ్యాంగ్ గ్రెనేడ్‌లు, టియర్ గ్యాస్ వంటివి ఉపయోగించారు.
నేషనల్ గార్డ్ మోహరింపు
లాస్ ఏంజిల్స్‌లో కొనసాగుతున్న ఈ ప్రదర్శనలను అణచివేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2 వేల మంది నేషనల్ గార్డ్ సైనికులను మోహరించారు. కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసమ్ ఈ చర్యను రెచ్చగొట్టే చర్యగా విమర్శించారు. వైట్ హౌస్ ఒక ప్రకటనలో… ఈ రైడ్స్ అక్రమ ఇమ్మిగ్రెంట్ల దండయాత్రను అరికట్టడానికి అవసరమైనవని పేర్కొంది. కాలిఫోర్నియా డెమోక్రటిక్ నాయకులు ‘తమ పౌరులను రక్షించే బాధ్యతను పూర్తిగా విస్మరించార’ని కూడా ఆరోపించింది. ఈ రైడ్స్ ట్రంప్ పాలనలో రోజుకు కనీసం 3 వేల మంది వలసదారులను అరెస్టు చేయాలనే లక్ష్యం ఉంది.
Source:Wall Street Journal