హార్వర్డ్ విశ్వ’వ్యభిచార’లయం – అంతర్జాతీయ యూనివర్సిటీలో ఎప్‌స్టీన్ పాగా

Harvard Epstein
  • ఇక్కడి విద్యార్థినులను పెద్దలకు తార్చిన జెఫ్రీ
  • హేస్టీ పుడ్డింగ్ క్లబ్ ముసుగులో సెక్స్ దందా
  • కోట్లలో విరాళాలు… విద్యార్థినుల సరఫరా
  • నకిలీ పెళ్లిళ్లతో అక్రమ వీసాలతో స్టూడెంట్స్
  • విదేశీ విద్యార్థినుల భవిష్యత్ బ్రేక్ డౌన్!
  • కోట్ల రూపాయల వ్యయంతో కామ సామ్రాజ్యం
  • విశ్వవిద్యాలయ అధికారుల నైతిక పతనం
  • హార్వర్డ్ నుండి స్టాన్‌ఫోర్డ్ వరకు ఇదే దరిద్రం
  • ఎప్‌స్టీన్ ఫైల్సులో బట్టబయలైన బండారం

సహనం వందే, అమెరికా:

ప్రపంచ మేధావులను తయారు చేయాల్సిన హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఒక లైంగిక నేరగాడికి అడ్డాగా మారింది. నిధుల కక్కుర్తితో వర్సిటీ పెద్దలు జెఫ్రీ ఎప్‌స్టీన్ అనే అపరాధికి రెడ్ కార్పెట్ పరిచారు. విరాళాల ముసుగులో సాగిన ఈ సెక్స్ స్కాండల్ ఇప్పుడు ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తోంది. విద్యాసంస్థల ముసుగులో జరిగిన ఈ ఘోరమైన అక్రమ రవాణా బట్టబయలైంది.

Harvard Sex Scandal

హేస్టీ పుడ్డింగ్ క్లబ్ ముసుగులో దందా
హార్వర్డ్ క్యాంపస్‌లోని హేస్టీ పుడ్డింగ్ క్లబ్ ఎప్‌స్టీన్ కామవాంఛలకు కేంద్రంగా మారింది. ఇక్కడ ఎప్‌స్టీన్ కోసం ఒక ప్రత్యేక టేబుల్ ఎప్పుడూ సిద్ధంగా ఉండేది. ఆ టేబుల్ చుట్టూ హార్వర్డ్ విద్యార్థినులు, విదేశీ యువతులు ఉండేవారు. యువతుల కెరీర్ ఆశలను ఎరగా చూపి అతను వారిని బుట్టలో వేసుకునేవాడు. క్లబ్ ఈవెంట్లే వేదికగా తన ప్రైవేట్ దీవులకు వారిని ఆహ్వానించేవాడు.

నిధుల ప్రవాహం… అధికారుల మౌనం
ఎప్‌స్టీన్ ఈ క్లబ్‌కు ఏటా 42 లక్షల రూపాయల చొప్పున విరాళాలు ఇచ్చాడు. 2008లో మైనర్లపై లైంగిక వేధింపుల కేసులో దోషిగా తేలినా నిధులు ఆగలేదు. విద్యాసంస్థల ప్రతిష్టను అతను తన నేరాలకు రక్షణ కవచంగా వాడుకున్నాడు. నిధుల కోసం వర్సిటీ అధికారులు అతని నేరచరిత్రను పూర్తిగా విస్మరించారు. ఆ సొమ్ము కేవలం విరాళం కాదు అది పచ్చి లంచమని స్పష్టమవుతోంది.

Jeffry Epstein

అక్రమ వీసాలు… నకిలీ పెళ్లిళ్లు
విదేశీ యువతులను అమెరికాకు రప్పించేందుకు హార్వర్డ్ అధికారులే సాయం చేశారు. ఇంగ్లీష్ నేర్చుకోవాలనే సాకుతో వారికి విద్యార్థి వీసాలు ఇప్పించేవారు. వారిని శాశ్వతంగా ఇక్కడే ఉంచేందుకు నకిలీ వివాహాలు కూడా చేయించారు. ఇలా సుమారు 300 మంది యువతులను వివిధ దేశాల నుంచి రప్పించారు. ఇమ్మిగ్రేషన్ చట్టాలను ఉల్లంఘించడంలో వర్సిటీ యంత్రాంగం ప్రత్యక్షంగా సహకరించింది.

కోట్ల రూపాయల వ్యయంతో కామ సామ్రాజ్యం
ఈ వ్యవస్థను నడపడానికి ఎప్‌స్టీన్ ఏకంగా వందల కోట్ల రూపాయలు ఖర్చు చేశాడు. ఇందులో విదేశీ యువతుల రవాణా, వీసాల కోసమే 270 కోట్ల రూపాయలు వెచ్చించాడు. ఎల్ సాల్వడార్, రువాండా వంటి దేశాల నుంచి అమ్మాయిలను తెప్పించాడు. హార్వర్డ్ వేదికగా సాగిన ఈ బేరసారాల్లో వర్సిటీకి ఇచ్చింది చాలా తక్కువ. అత్యధిక భాగం కేవలం మానవ అక్రమ రవాణా కోసమే వాడటం దిగ్భ్రాంతి కలిగిస్తోంది.

హార్వర్డ్ నుండి స్టాన్‌ఫోర్డ్ వరకు…
ప్రస్తుతం ఈ కుంభకోణంలో ప్రొఫెసర్ల పాత్రపై లోతైన విచారణ సాగుతోంది. లియోన్ బోట్‌స్టెయిన్ వంటి విద్యావేత్తలు ఎప్‌స్టీన్ సంబంధాలను అంగీకరించారు. హార్వర్డ్ నుండి స్టాన్‌ఫోర్డ్ వరకు ఉన్నత విద్యాసంస్థలు కేవలం డబ్బు కోసం ఒక అపరాధికి గౌరవాన్ని కల్పించాయి. కొలంబియా, ఓహియో స్టేట్ యూనివర్సిటీ ప్రతినిధులు కూడా అతనిని కలిశారు. బార్డ్ కాలేజీ అధ్యక్షుడు లియోన్ బోట్‌స్టెయిన్ పేరు ప్రధానంగా వినిపిస్తోంది. ఓహియో స్టేట్ యూనివర్సిటీ తన విరాళాలను 2020లో తిరిగి ఇచ్చేసింది. మేధావులు డబ్బు ముందు మోకరిల్లడం వ్యవస్థాగత వైఫల్యానికి నిదర్శనంగా మారింది.

నలిగిపోయిన విద్యార్థినుల భవిష్యత్తు
రాజకీయ నాయకులు, ప్రముఖులకు హార్వర్డ్ అమ్మాయిలను ఎరగా వేసినట్లు ఆధారాలున్నాయి. విద్యను అందించాల్సిన చోట లైంగిక బానిసత్వం సాగడంపై విద్యార్థులు మండిపడుతున్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ స్థాయిలో డిమాండ్ పెరుగుతోంది. ఈ పాపపు సొమ్ముపై విద్యాసంస్థలు పశ్చాత్తాపం వ్యక్తం చేసినా జరగాల్సిన నష్టం జరిగిపోయింది. విద్యా వ్యవస్థలో పారదర్శకత లేకపోవడమే ఈ స్కాండల్‌కు ప్రధాన కారణం.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *