
మహారాష్ట్రలో హిందీకి బ్రేక్
సహనం వందే, ముంబై: మహారాష్ట్రలోని పాఠశాలల్లో 1 నుంచి 5వ తరగతి వరకు హిందీని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి తాత్కాలికంగా బ్రేక్ పడింది. రాష్ట్రంలో భాషా రాజకీయాలు మరోసారి వేడెక్కడంతో, ప్రాంతీయ వాణి గట్టిగా వినిపించడంతో ఈ ఉత్తర్వును నిలిపివేస్తూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవల రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోనూ ప్రాథమిక స్థాయి విద్యార్థులకు హిందీని తప్పనిసరి చేస్తూ ఒక ఉత్తర్వును జారీ చేసింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత…