తెలంగాణ బార్‌ కౌన్సిల్‌ సభ్యుడిగా రాఘ‌వులు

Raghavulu Member of the Telangana bar Council

సహనం వందే, హైదరాబాద్‌:

తెలంగాణ బార్‌కౌన్సిల్‌ ఎన్నికల్లో రాఘ‌వులు దేవ‌ళ్ల విజయం సాధించారు. జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఎన్నికల ఫలితాలను తాజాగా ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో ఈ ఎన్నికల పోలింగ్‌ జరిగింది. మొత్తం 55 మంది మహిళలతోపాటు 203 మంది పోటీచేశారు. ఓట్ల లెకింపు ప్రక్రియ ఫిబ్రవరి 10న ప్రారంభంకాగా… 23 మంది బార్‌ కౌన్సిల్‌ సభ్యుల ఎన్నిక ప్ర‌క్రియ మంగ‌ళ‌వారంతో పూర్త‌య్యింది. మంగ‌ళ‌వారం వెలువడిన ఫలితాల్లో రాఘ‌వులు దేవ‌ళ్ల విజయం సాధించారు. ఆయన ఇంతకుముందు డెబిట్ రిక‌వ‌రి ట్రిబ్యూన‌ల్ (డీఆర్‌టీ) జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీగా సేవలందించారు.

Felicitation to Raghavulu

విజ‌యానంత‌రం డీఆర్‌టీలో న్యాయ‌వాదులు ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా సీనియ‌ర్ న్యాయ‌వాదులు జీకే దేశ్‌పాండే, విజ‌య్ కుమార్, శ్రీ‌ధ‌ర్‌రెడ్డి త‌దిత‌ర న్యాయ‌వాదులు ఆయనకు శాలువా క‌ప్పి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సందర్భంగా రాఘ‌వులు దేవ‌ళ్ల మాట్లాడుతూ అడ్వకేట్ల సమస్యల పరిష్కారానికి పనిచేస్తానని తెలిపారు. వారి సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. తన విజయానికి కృషి చేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *