ట్రబుల్ షూటర్… డబుల్ గేమ్

సీఎం రేవంత్ రెడ్డితో హరీష్ రావు భేటీ వెనుక మతలబు ఏంటి?
– గత పాలనలో అక్రమాలను కప్పిపుచ్చేందుకేనా…

సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ రాజకీయ రంగస్థలంలో హరీష్ రావు తన “లాలూచీ రాజకీయం”తో సందడి చేస్తున్నారు. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో జరిగిన 15 నిమిషాల మీటింగ్ రాష్ట్రంలో రాజకీయ గాసిప్‌ల సుడిగాలిని రేపింది. “సీతాఫల్‌మండి కళాశాల పనుల కోసం కలిశాను” అని హరీష్ రావు సీరియస్‌గా చెప్పినా, బీఆర్ఎస్ శ్రేణులు “అబ్బా! ఇది కాళేశ్వరం కేసుల కోసం కాకపోతే మరేమిటి?” అంటూ గుండెలు బాదుకుంటున్నాయి.
హరీష్ రావు “టీ టైమ్” డ్రామా…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం తర్వాత హరీష్ రావు మీడియాకు “సికింద్రాబాద్‌లో కళాశాల పనులు ఆగిపోయాయి, సీఎంతో మాట్లాడాను” అని సీదాగా చెప్పారు. కానీ రాజకీయ విశ్లేషకులు “అయ్యో రావు గారూ, ఇది కళాశాల కోసం కాదు, కేసుల కోసం టీ టైమ్ అని అందరికీ తెలుసు” అంటూ గట్టిగా నవ్వుకుంటున్నారు. ఒక సీనియర్ విశ్లేషకుడు “హరీష్ రావు సీఎంతో టీ తాగుతూ ‘అన్నా, కేసులు క్లీన్ చేయి, నేను నీకు బీఆర్ఎస్ సీట్లు కాస్త గిఫ్ట్ ఇస్తా’ అని చెప్పినట్లున్నారంటూ సెటైర్ విసిరారు.
బీఆర్ఎస్ శ్రేణుల విస్మయం: ఇదేం ఖర్మ రావు గారూ?
బీఆర్ఎస్ కార్యకర్తలు ఈ మీటింగ్‌ను చూసి “అరెరె! మా హరీష్ రావు అధికార పార్టీతో లంచ్ కాకపోయినా టీ అయినా తాగుతున్నారా? ఇది కేసీఆర్ గారి పర్మిషన్‌తోనా లేక సర్‌ప్రైజ్ గిఫ్ట్‌నా?” అంటూ తలలు పట్టుకుంటున్నారు. ఒక కార్యకర్త “సీతాఫల్‌మండి కళాశాల కోసం పద్మారావును తీసుకెళ్లడం ఏంటి? ఇది రాజకీయ సినిమా షూటింగ్ కాకపోతే మరేమిటి?” అని ఆగ్రహం వెళ్లగక్కాడు. అయినా సీతాఫల్మండి సిద్దిపేట నియోజకవర్గంలో లేదు కదా అంటున్నారు. మరొకరు “గతంలో వైఎస్‌తో సీక్రెట్ డీల్ చేసినట్టు, ఇప్పుడు రేవంత్‌తో చేసి మా పార్టీని రోడ్డున పడేస్తారా?” అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లాలూచీ కాదు… లూజర్ రాజకీయం
ఈ భేటీ గురించి తెలిసిన బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ ‘నేను రేవంత్‌ను రోజూ తిడుతుంటే నీవు వెళ్లి టీ తాగుతున్నావా? ఇది లాలూచీ కాదు, లూజర్ రాజకీయం” అని గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది.
కాంగ్రెస్ కూల్: “మాకు టెన్షన్ లేదు!”
ఇక కాంగ్రెస్ వర్గాలు ఈ భేటీని చిన్న విషయం అంటూ తేలిగ్గా తీసుకుంటున్నాయి. “ఎమ్మెల్యే కలిశాడు, అభివృద్ధి గురించి మాట్లాడాడు, అంతే కథ!” అని ఒక కాంగ్రెస్ నేత కూల్‌గా చెప్పారు. కానీ లోపల్లోపల “హరీష్ రావు కాంగ్రెస్‌లోకి జంప్ చేస్తే బాగుంటుంది కదా” అని కొందరు కలలు కంటున్నారు. ఒక నేత అయితే “హరీష్ గారు వస్తే ఓకే, కానీ కాళేశ్వరం కేసులు మాత్రం క్లీన్ చేయడం కష్టం సామీ” అని సెటైర్ వదిలారు.
“హరీష్ – రాజకీయ డబుల్ డీలింగ్”
రాజకీయ విశ్లేషకులు ఈ భేటీని “హరీష్ రావు డబుల్ డీలింగ్” అంటూ ఆడుకుంటున్నారు. “బయట రేవంత్‌ను తిట్టి, లోపల టీ తాగడం హరీష్ స్పెషాలిటీ. ఇది కేసుల నుంచి ఎస్కేప్ కోసమా లేక రేవంత్‌తో కొత్త బాండింగ్ కోసమా అనేది త్వరలో తెలుస్తుంది” అని ఒకరు అన్నారు. మరొకరు “హరీష్ రావు లాలూచీ కాదు, లాజిక్‌లెస్ రాజకీయ గేమర్” అని గట్టిగా ఎద్దేవా చేశారు.
క్లైమాక్స్: టీ తాగినా కేసులు ఉన్నాయ్ గదా!
ఈ మీటింగ్ వెనుక రియల్ స్టోరీ ఏంటో ఇప్పుడు ఊహించడం కష్టం. కానీ ఒకటి క్లియర్ – హరీష్ రావు తన “లాలూచీ రాజకీయం”తో మళ్లీ హైలైట్ అయ్యారు. ఇది కేసుల క్లీన్ స్వీప్ డీలా? లేక కాంగ్రెస్‌తో కొత్త ఫ్రెండ్‌షిప్ ట్రైలరా? రాజకీయ సీరియల్‌లో క్లైమాక్స్ కోసం వెయిట్ చేద్దాం! అప్పటిదాకా “టీ తాగండి, రాజకీయం ఆడండి” అని హరీష్ స్టైల్‌లో సలహా ఇచ్చి సెలవు తీసుకుంటున్నాం!

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *