కార్పొరేట్ లోకంలో మత కల్లోలం – నాసిక్ టీసీఎస్ కంపెనీలో దారుణం

TCS Nasik Women Employees
  • లైంగిక వేధింపులు… నిదా ఖాన్ గుట్టురట్టు
  • సామాజిక మాధ్యమాల్లో రచ్చ
  • లైంగిక వేధింపుల ఆరోపణలు
  • బాధితుడి మత మార్పిడి

సహనం వందే, నాసిక్:

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) నాసిక్ కేంద్రం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. అమాయక మహిళా ఉద్యోగుల ఆత్మగౌరవంతో ఆటలాడుకుంటూ మత విద్వేషాలను రెచ్చగొడుతూ కొందరు కేటుగాళ్లు సాగించిన దౌర్జన్యం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. టెక్నాలజీ ముసుగులో జరుగుతున్న ఈ దారుణమైన సెక్స్, మత మార్పిడి స్కాండల్ ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది.

పోష్ కమిటీ వైఫల్యం
ఈ కేసులో ప్రధాన నిందితురాలు నిదా ఖాన్ వ్యవహారం అత్యంత వివాదాస్పదమైంది. 2021 నుండి ఇక్కడ పని చేస్తున్న ఆమె లైంగిక వేధింపుల నిరోధక చట్టం కింద ఏర్పడిన అంతర్గత కమిటీలో సభ్యురాలు. బాధితులకు అండగా ఉండాల్సిన నిదా మహిళలు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. పైగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయకుండా వారిని అడ్డుకుంది. ప్రస్తుతం పోలీసులకు దొరకకుండా ముంబైలో తలదాచుకున్న 25 ఏళ్ల నిదా తాను గర్భవతినని చెబుతూ నాసిక్ కోర్టులో ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవడం గమనార్హం.

నిందితుల బాగోతం
పోలీసులు ఈ కేసులో ఇప్పటివరకు 9 ఫిర్యాదులను నమోదు చేశారు. మొత్తం ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. వారిలో డానిష్ షేక్, తౌసిఫ్ అత్తర్, రజా మెమన్, షారుఖ్ ఖురేషి, షఫీ షేక్, ఆసిఫ్ అఫ్తాబ్ అన్సారీలతో పాటు హెచ్ఆర్ హెడ్ అశ్విని చైనానీ కూడా ఉన్నారు. ఈ నిందితులు కార్యాలయంలో మహిళా ఉద్యోగులతో అసభ్యకరంగా ప్రవర్తించేవారు. వారి శారీరక ఆకృతిపై వ్యాఖ్యలు చేస్తూ అసభ్య పదజాలంతో వేధించేవారు. ఒక మహిళను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేయడంతో ఈ మొత్తం దారుణం వెలుగులోకి వచ్చింది.

Nida Khan TCS Nasik

మత విద్వేషాల మంట
కేవలం లైంగిక వేధింపులకే పరిమితం కాకుండా ఉద్యోగుల మత విశ్వాసాలను కూడా వీరు కించపరిచారు. హిందూ పండుగలకు మహిళలు చీరలు కట్టుకుని వస్తే ఎగతాళి చేసేవారు. తౌసిఫ్ అత్తర్ హిందూ మత ఆచారాలను లక్ష్యంగా చేసుకుని అవమానించేవాడు. ఒక పురుష ఉద్యోగిని బలవంతంగా నమాజ్ చేయించి అతని మతాన్ని దూషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వేధింపుల తట్టుకోలేక ఇప్పటికే ఒక పురుష ఉద్యోగి ఇస్లాంలోకి మారినట్లు సమాచారం.

భయానక వేధింపులు
బాధితులు చెప్పిన వివరాలు అత్యంత దిగ్భ్రాంతికరంగా ఉన్నాయి. కొత్తగా పెళ్లయిన ఒక హిందూ మహిళను లక్ష్యంగా చేసుకుని నీ భర్త కంటే నేనే మేలు అంటూ ఒక నిందితుడు అసభ్యకర ప్రతిపాదనలు చేశాడు. మరో ఘటనలో ఒక మహిళా ఉద్యోగి శారీరక కొలతల గురించి అడుగుతూ ఆమె సన్నగా ఉందని వ్యాఖ్యానిస్తూ పొట్టపై చేయి వేసి తాకాడు. కార్యాలయం లోపల ఇలాంటి అరాచకాలు జరుగుతున్నా యాజమాన్యం ప్రేక్షక పాత్ర వహించడం చర్చనీయాంశమైంది.

అధికారుల నిర్లక్ష్యం
కంపెనీ హెడ్ ఆఫీసర్‌కు బాధితులు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయింది. నిందితులు చేస్తున్న పనులను ఆపాల్సింది పోయి ఆఫీసర్ వారికి పరోక్షంగా సహకరించాడని పోలీసులు పేర్కొంటున్నారు. బాధితురాలు పదేపదే మౌఖికంగా ఫిర్యాదు చేసినా వేధింపులను అరికట్టడంలో సంస్థ విఫలమైంది. అంతర్గత విచారణ ప్రక్రియలో జరిగిన లోపాలను, కమ్యూనికేషన్ లాగ్స్‌ను ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రస్తుతం లోతుగా పరిశీలిస్తోంది.

వైద్య పరీక్షల నివేదిక
నిదా ఖాన్ గర్భవతి అని చేస్తున్న వాదనలను పోలీసులు ఇంకా ధృవీకరించలేదు. దీనికోసం అధికారిక వైద్య పరీక్షలు నిర్వహించాలని ఎస్ఐటీ భావిస్తోంది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి తోటి మహిళలపై జరుగుతున్న అన్యాయాన్ని కప్పిపుచ్చిన నిదా కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఐటీ రంగంలో మహిళల భద్రత, మత స్వేచ్ఛపై ఈ ఉదంతం అనేక ప్రశ్నలను లేవనెత్తింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *