- డీలిమిటేషన్ జరిగితే ఉత్తరాధిపత్యమే
- నార్త్ సీట్లతోనే కేంద్రంలో రాజకీయాధికారం
- ఇక భవిష్యత్తులో ఢిల్లీ పీఠం దక్షిణాదికి దూరం
- పన్నులు కట్టడం… సలాం కొట్టడమే మన పని
- ఉత్తరాదిని పోషించడమే దక్షిణాది కర్తవ్యమా?
- హైబ్రిడ్ మోడల్ పరిష్కారం చూపిన రేవంత్
సహనం వందే, హైదరాబాద్:
దేశంలో దక్షిణాది రాష్ట్రాల రాత మాత్రం మారడం లేదు. మనం రెక్కలు ముక్కలు చేసుకుని దేశానికి అన్నం పెడుతుంటే… ఎవరో వచ్చి ఆ పళ్లెం లాక్కుని వెళ్లే కుట్ర ఇది. అభివృద్ధికి మనం నిచ్చెనలవుతుంటే… ఆ నిచ్చెన మెట్లు ఎక్కి పీఠం ఎక్కేది మాత్రం ఉత్తరాది నేతలే. ఇది కేవలం సీట్ల పెంపు కాదు… దక్షిణాది ఆత్మగౌరవంపై జరుగుతున్న సర్జికల్ స్ట్రైక్. ప్రజాస్వామ్యం అంటే కేవలం తలల లెక్కింపేనా? తెలివితేటలకు, కష్టానికి విలువ లేదా? ఢిల్లీ పీఠంపై ఉత్తరాది గుత్తాధిపత్యం దక్షిణాది ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోంది. ఈ వివక్షపై ఇప్పుడు యుద్ధం మొదలైంది.

అగాధంగా మారనున్న ప్రాతినిధ్యం
ప్రస్తుతం ఉన్న 543 లోక్ సభ సీట్లలో దక్షిణాది వాటా 130 మాత్రమే. ఇందులో కేరళకు 20, తమిళనాడుకు 39, ఆంధ్రప్రదేశ్‌కు 25, తెలంగాణకు 17, కర్ణాటకకు 28, పుదుచ్చేరికి 1 సీటు ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాల వాటా 413 సీట్లు. అంటే ఇప్పుడున్న గ్యాప్ 283 సీట్లు. ఒకవేళ 50 శాతం సీట్లు పెంచితే దక్షిణాది సీట్లు 195కు చేరుతాయి. కానీ ఉత్తరాది సీట్లు ఏకంగా 620కు పెరుగుతాయి. అప్పుడు ఆ గ్యాప్ 425కు చేరుతుంది. అంటే దక్షిణాది ఎంపీల మద్దతు లేకుండానే ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పడుతుంది.
అంకెల్లోనే అసలు వివక్ష
ఒకప్పుడు కేరళకు 20 సీట్లు ఉంటే ఉత్తరప్రదేశ్‌కు 80 ఉన్నాయి. ఈ రెండింటి మధ్య తేడా 60 సీట్లు. ఒకవేళ సీట్ల పెంపు జరిగితే కేరళ సీట్లు 30కి, ఉత్తరప్రదేశ్ సీట్లు 120కి పెరుగుతాయి. అప్పుడు ఈ గ్యాప్ 90కి చేరుతుంది. అంటే అభివృద్ధిలో వెనుకబడి జనాభాను పెంచుకున్న రాష్ట్రాలకే ఎక్కువ సీట్లు దక్కుతాయి. ఇది దేశ సమాఖ్య స్ఫూర్తికే విఘాతమని రేవంత్ రెడ్డి విశ్లేషించారు. సంఖ్య పెరిగే కొద్దీ దక్షిణాది ప్రాధాన్యత ఢిల్లీలో నామమాత్రంగా మారిపోయే ప్రమాదం పొంచి ఉంది.
రేవంత్ హైబ్రిడ్ మోడల్
ఈ సమస్యకు రేవంత్ రెడ్డి ఒక వినూత్నమైన హైబ్రిడ్ మోడల్‌ను ప్రతిపాదించారు. పెంచాలనుకున్న 272 సీట్లలో 50 శాతం అంటే 136 సీట్లను జనాభా ప్రాతిపదికన కేటాయించాలని కోరారు. మిగిలిన 50 శాతం అంటే మరో 136 సీట్లను రాష్ట్రాల స్థూల ఆర్థిక ఉత్పత్తి అంటే జీఎస్‌డీపీ ఆధారంగా కేటాయించాలని డిమాండ్ చేశారు. అప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థను భుజాన మోస్తున్న రాష్ట్రాలకు సరైన గౌరవం దక్కుతుందని విశ్లేషించారు. జనాభా పెంచడం అభివృద్ధికి కొలమానం కాకూడదని ఆయన స్పష్టం చేశారు.
దక్షిణాది ఐక్యపోరుకు పిలుపు
ఈ వివక్షపై పోరాడేందుకు స్టాలిన్, సిద్ధరామయ్య వంటి ముఖ్యమంత్రులతో కలిసి ముందుకు వెళ్తామని రేవంత్ ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 31 లోపు జనాభా లెక్కలు పూర్తి చేసి 2028లో శాస్త్రీయంగా ఈ ప్రక్రియ చేపట్టాలని సూచించారు. జాతీయ స్థాయిలో అఖిలపక్ష సమావేశం నిర్వహించిన తర్వాతే ముందడుగు వేయాలని ప్రధానికి లేఖ రాశారు. సంఖ్యాబలం లేకపోతే కేంద్ర మంత్రులు కూడా కేవలం గేటు దగ్గర నమస్కారాలు పెట్టే బంట్రోతులుగా మిగిలిపోతారని రేవంత్ ఘాటుగా హెచ్చరించారు.
- ప్రస్తుత పరిస్థితి (ప్రస్తుతం ఉన్న 543 సీట్లు)
దక్షిణాది రాష్ట్రాలు (130 సీట్లు): కేరళ (20), తమిళనాడు (39), ఆంధ్రప్రదేశ్ (25), తెలంగాణ (17), కర్ణాటక (28), పుదుచ్చేరి (1). మొత్తం = 130
మిగిలిన రాష్ట్రాలు (ఉత్తరాది/ఇతర): 543 – 130 = 413
ప్రస్తుత అంతరం (గ్యాప్): 413 – 130 = 283
—————————————————————–
- ఒకవేళ 50 శాతం సీట్లు పెంచితే (సీఎం రేవంత్ రెడ్డి గారి విశ్లేషణ)
సీఎం గారు తన ప్రసంగంలో “ప్రో-రేటా” (అంటే ఉన్న సీట్లపై 50% పెంచడం) పద్ధతిని వివరిస్తూ ఈ గణాంకాలు చెప్పారు:
దక్షిణాది సీట్లు: 130 + 65 (50% పెంపు) = 195
మిగిలిన సీట్లు: 413 + 207 (సుమారు 50%) = 620
కొత్త అంతరం (గ్యాప్): 620 – 195 = 425
———————————————-
- కేరళ vs ఉత్తరప్రదేశ్ ఉదాహరణను సీఎం రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు.
ప్రస్తుతం: కేరళ (20), యూపీ (80). గ్యాప్ = 60
50% పెంపు తర్వాత:
కేరళ: 20 + 10 = 30
యూపీ: 80 + 40 = 120