- జేడీ వాన్స్ పై నకిలీ క్రైస్తవుడని రచ్చ
- భార్య ఉషా వాన్స్ భారతీయ హిందూ
- ఆమెని పెళ్లి చేసుకున్న వాన్స్ పై ట్రోలింగ్
- గతంలోనూ జాతి వివక్షపూరిత వ్యాఖ్యలు
సహనం వందే, వాషింగ్టన్:
అమెరికాలో జాతి వివక్షతతోపాటు మత విద్వేషాలు రగిలిపోతున్నాయి. ఏకంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, ఆయన భార్య ఉషా వాన్స్‌ను టార్గెట్ చేస్తూ మత, జాతి వివక్షా పూరితమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఉషా వాన్స్ భారతీయ తెలుగు హిందూ కుటుంబం కావడం… జేడీ వాన్స్ అమెరికన్ క్రిస్టియన్ కావడంతో వారిపై మతపూరితమైన ట్రోలింగ్ చేస్తున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ గుడ్ ఫ్రైడే సందర్భంగా రోమ్‌లో గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వివాదాస్పదమైంది. హిందూ మతాన్ని అనుసరించే ఉషా వాన్స్‌ను ఆయన వివాహం చేసుకున్నందుకు కొందరు నెటిజన్లు ఆయనను ‘నకిలీ క్రైస్తవుడం’టూ తీవ్రంగా ట్రోల్ చేశారు. ఈ ఘటన భారత సంతతికి చెందిన ఉషా వాన్స్‌పై మత, జాతి వివక్షా పూరిత వ్యాఖ్యలకు మరోసారి తెరలేపింది.
రెండు మత సంప్రదాయాలతో వివాహం…
2014లో వారి వివాహం హిందూ సంప్రదాయంలో జరిగినప్పటి ఫోటోను షేర్ చేస్తూ పలువురు నెటిజన్లు వాన్స్‌ను నకిలీ క్రైస్తవుడని విమర్శించారు. ఈ ట్రోలింగ్‌లో ఉషా భారతీయ మూలాలు, ఆమె మతం కూడా లక్ష్యంగా మారాయి. తెలుగు ప్రాంతం… భారత సంతతికి చెందిన అమెరికన్ న్యాయవాది ఉషా వాన్స్ యేల్ లా స్కూల్లో జేడీ వాన్స్‌తో కలిసి చదువుకున్నారు. వారి వివాహం క్రైస్తవ, హిందూ సంప్రదాయాల ప్రకారం జరిగింది. ఇది భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం. అయితే ఈ దంపతులు గతంలోనూ వివక్ష పూరిత వ్యాఖ్యలు ఎదుర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఉషా హిందూ వ్యతిరేక దూషణలకు గురైనప్పుడు, నార్త్ అమెరికాలోని హిందువుల సమాఖ్య ఈ దాడులను ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది. జేడీ వాన్స్ తన జీవితంలో ఉషా అందించిన సహకారాన్ని కొనియాడారు. 2019లో కాథలిక్ మతంలోకి మారిన వాన్స్, తన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉషా ప్రోత్సాహం ఎంతో విలువైనదని చెప్పారు.
హిందూ భార్య కారణంగా ట్రోలింగ్…
జేడీ వాన్స్ తన ఎక్స్ ఖాతాలో, ‘నా అధికారిక విధులు నన్ను గుడ్ ఫ్రైడే రోజున రోమ్కు తీసుకువచ్చాయి. త్వరలో నా కుటుంబంతో కలిసి ఈ అందమైన నగరంలోని చర్చికి వెళ్తాన’ని రాసుకొచ్చారు. మరో పోస్ట్‌లో, ‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరికీ… ముఖ్యంగా అమెరికాలోని వారికి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. ఏసు మనం జీవించడానికి మరణించాడ’ని పేర్కొన్నారు. అయితే ఈ పోస్ట్‌లు పెట్టిన వెంటనే, వాన్స్ హిందూ మతస్థురాలైన ఉషా వాన్స్‌ను పెళ్లి చేసుకున్నందున ఆయన క్రైస్తవ విశ్వాసం నిజమైనది కాదంటూ ట్రోలింగ్ మొదలైంది.
రెండు మత సంప్రదాయాలతో వివాహం…
2014లో వారి వివాహం హిందూ సంప్రదాయంలో జరిగినప్పటి ఫోటోను షేర్ చేస్తూ పలువురు నెటిజన్లు వాన్స్‌ను నకిలీ క్రైస్తవుడని విమర్శించారు. ఈ ట్రోలింగ్‌లో ఉషా భారతీయ మూలాలు, ఆమె మతం కూడా లక్ష్యంగా మారాయి. తెలుగు ప్రాంతం… భారత సంతతికి చెందిన అమెరికన్ న్యాయవాది ఉషా వాన్స్ యేల్ లా స్కూల్లో జేడీ వాన్స్‌తో కలిసి చదువుకున్నారు. వారి వివాహం క్రైస్తవ, హిందూ సంప్రదాయాల ప్రకారం జరిగింది. ఇది భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనం. అయితే ఈ దంపతులు గతంలోనూ వివక్ష పూరిత వ్యాఖ్యలు ఎదుర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఉషా హిందూ వ్యతిరేక దూషణలకు గురైనప్పుడు, నార్త్ అమెరికాలోని హిందువుల సమాఖ్య ఈ దాడులను ఖండిస్తూ ప్రకటన విడుదల చేసింది. జేడీ వాన్స్ తన జీవితంలో ఉషా అందించిన సహకారాన్ని కొనియాడారు. 2019లో కాథలిక్ మతంలోకి మారిన వాన్స్, తన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉషా ప్రోత్సాహం ఎంతో విలువైనదని చెప్పారు.
‘నా తల్లిదండ్రులు హిందువులు’
ఉషా తన హిందూ నేపథ్యం గురించి, ‘నా తల్లిదండ్రులు హిందువులు. వారి మతమే వారిని గొప్ప తల్లిదండ్రులుగా, మంచి వ్యక్తులుగా తీర్చిదిద్దింది. నా జీవితంలో ఆ శక్తిని నేను చూశాన’ని అన్నారు. ఈ విమర్శలు రాజకీయంగా ప్రేరేపితమైనవని, జాతి వివక్షను ప్రోత్సహించేలా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.