పుస్తకం లేని ప్రపంచం – చదువు మధ్యలో జెన్ జెడ్ సాహస యాత్ర

GenZ Gap Year Craze
  • క్లాస్ రూమ్ బోర్… టూరుతో పరార్
  • విద్యార్థుల్లో ‘గ్యాప్ ఇయర్’ క్రేజ్
  • ఒత్తిడికి చెక్ పెట్టేలా కెరీర్‌కు కొత్త ఊపిరి
  • విదేశాలకు వెళ్లి వస్తున్న నేటి తరం

సహనం వందే, హైదరాబాద్:

పుస్తకాల మోత.. పరీక్షల వేట.. 15 ఏళ్ల సుదీర్ఘ బడి జీవితం తర్వాత ఆ కళ్లలో ఏదో అలసట. రేపటి పోటీ ప్రపంచంలోకి దూకడానికి ముందు ఒక్క క్షణం ఆగి శ్వాస తీసుకోవాలనే ఆరాటం. ఇది కేవలం విరామం కాదు.. తనను తాను వెతుక్కునే ప్రయాణం. ఈ తరం యువత చదువుల మధ్యలో గ్యాప్ ఇయర్ తీసుకుంటూ కొత్త పాఠాలు నేర్చుకుంటోంది.

అలసిన గుండెలకు విశ్రాంతి
హైదరాబాదుకు చెందిన 18 ఏళ్ల షీలా, సుస్మిత ఇద్దరూ ప్రాణ స్నేహితులు. కాలేజీ చదువుల నుంచి వీరికి విరామం కావాలనిపించింది. లెక్చరర్లు ఒత్తిడి చేసినా వినకుండా చదువును ఏడాది పాటు పక్కన పెట్టారు. ఇలా దేశంలో 2025లో ఏకంగా 36,925 మంది విద్యార్థులు ఉన్నత స్థాయి చదువులను వాయిదా వేసుకున్నారు. ఇలా దేశంలోనూ ప్రపంచంలోనూ ఈ ట్రెండ్ భారీగా పెరుగుతుంది.

GenZ Gap Year Craze

కష్టపడి సంపాదించిన కలలు
విదేశీ ప్రయాణం అంటే ఉచితంగా వచ్చేది కాదు. షీలా తన ప్రయాణ ఖర్చుల కోసం ఉద్యోగాలు చేసింది. సుస్మిత కూడా కూడా 6 నెలల పాటు ఒక సూపర్ మార్కెట్‌లో పనిచేసింది. వీరిద్దరూ కలిసి మొత్తం 4 ఉద్యోగాలు చేస్తూ పైసా పైసా పోగు చేశారు. ఆ డబ్బుతో 3 నెలల పాటు ఐరోపా దేశాల్లో పర్యటించారు. లండన్ లో అడుగుపెట్టిన ఆ కళ్లలో ఇప్పుడు ఒక వింతైన మెరుపు కనిపిస్తోంది.

ఆక్స్‌ఫర్డ్ మెడికల్ సీటు వదులుకుని
ఇక లండన్‌కు చెందిన 20 ఏళ్ల విక్టోరియా కథ మరోలా ఉంది. మెడిసిన్ చదవాలనేది ఆమె కల. కానీ మొదటి ప్రయత్నంలో ఒక్క సీటు కూడా రాలేదు. ఇతర కోర్సుల్లో చేరమని టీచర్లు ఒత్తిడి చేసినా ఆమె వినలేదు. గ్యాప్ ఇయర్ తీసుకుని తనను తాను తీర్చిదిద్దుకుంది. ఇప్పుడు ఆమె ప్రతిష్టాత్మక ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో మెడిసిన్ చదువుతోంది. గ్యాప్ ఇయర్ అనేది కాలయాపన కాదని ఆమె నిరూపించింది.

ఒంటరితనం… భయం
గ్యాప్ ఇయర్ తీసుకోవడం అంత సులభమేమీ కాదు. స్నేహితులందరూ యూనివర్సిటీకి వెళ్తుంటే ఇంట్లోనే ఉండటం బాధగా ఉంటుంది. విక్టోరియా ఆ సమయంలో చాలా ఒంటరిగా ఫీలయ్యింది. గ్వెన్ కూడా తాను తప్పుడు నిర్ణయం తీసుకున్నానా అని భయపడింది. కానీ ఈ సమయం తన వ్యక్తిగత ఎదుగుదలకు తోడ్పడుతుందని వారు నమ్మారు. ఈ విరామం వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది.

నిపుణుల విశ్లేషణ ఇదీ
హైదరాబాదుకు చెందిన విద్యానిపుణుడు నారాయణ దీనిపై ఆసక్తికర విషయాలు చెప్పారు. గ్యాప్ ఇయర్ అనేది కేవలం విరామం మాత్రమే కాదు. ఇది విద్యార్థుల వ్యక్తిగత ఆసక్తులను గుర్తించేందుకు ఒక గొప్ప అవకాశం. ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్‌లో విపరీతమైన పోటీ ఉంది. ఇలాంటి సమయంలో గ్యాప్ ఇయర్ లో పొందిన అనుభవాలు వారి రెజ్యూమెను మరింత బలంగా మారుస్తాయి. ప్రపంచాన్ని చూడటం వల్ల కొత్త ఆలోచనలు పుడతాయి. క్యాంపస్ ఆఫర్లలో వేల సంఖ్యలో విద్యార్థులు వాయిదా కోరుకోవడం ఒక సామాజిక మార్పుకు సంకేతంగా కనిపిస్తోంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *