మెడికల్ కౌన్సిల్ – నకిలీ వైద్యులపై కొరడా

  • 15 కేసులు నమోదు చేసిన మెడికల్ కౌన్సిల్
  • నకిలీ వైద్యులపై ఫిర్యాదుకు వాట్సాప్ నెంబర్ 91543 82727

సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణలో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యులపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టి.ఎం.సి.) ఉక్కుపాదం మోపింది. హైదరాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో నిర్వహించిన తనిఖీల్లో సరైన వైద్య విద్యా అర్హతలు లేకుండా డాక్టర్లుగా చలామణి అవుతున్న 15 మంది నకిలీ వైద్యులపై కేసులు నమోదు చేసింది.

నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు
గత నెలలో జరిగిన ఈ తనిఖీల అనంతరం ఈ కేసులు నమోదు చేసినట్లు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ తెలియజేసింది. ఈ తనిఖీలను డాక్టర్ ఆనంద్, డాక్టర్ కిరణ్ కుమార్, డాక్టర్ రాజీవ్ నాయక్, డాక్టర్ అరుంధతి, డాక్టర్ సన్నీ డేవిస్, డాక్టర్ శిరీష్, డాక్టర్ జి. శ్రీనివాస్ నేతృత్వంలో నిర్వహించారు. వైద్య సేవలు పొందే ముందు సంబంధిత డాక్టర్‌కు నిబంధనల ప్రకారం అర్హతలు, రిజిస్ట్రేషన్ నెంబరు ఉన్నదో లేదో నిర్ధారించుకోవాలని మెడికల్ కౌన్సిల్ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. నకిలీ వైద్యులను గుర్తించిన వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్లకు లేదా 91543 82727 వాట్సాప్ ద్వారా మెడికల్ కౌన్సిల్ కు సమాచారం ఇవ్వాలని సూచించింది.

నమోదైన కేసుల వివరాలు ఇవే:

ఎఫ్‌.ఐ.ఆర్. నెం: 63/2025 – పట్లూర్ గ్రామం, మర్పల్లి వద్ద నామలేని క్లినిక్ నడుపుతున్న ఎన్. కుమార్.

కొండాపూర్ పోలీస్ స్టేషన్ – సంగారెడ్డి జిల్లా:

ఎఫ్‌.ఐ.ఆర్. నెం: 102/2025 – మల్కాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నడుపుతున్న కె. బన్సీలాల్.

ఎఫ్‌.ఐ.ఆర్. నెం: 103/2025 – మల్కాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద జై దుర్గాభవాని ఫస్ట్ ఎయిడ్ సెంటర్ నడుపుతున్న ఎ. అనిల్ కుమార్.

సదాశివపేట పోలీస్ స్టేషన్ – సంగారెడ్డి జిల్లా:
ఎఫ్‌.ఐ.ఆర్. నెం: 300/2025 – శ్రీ సాయి రామ్ ఆసుపత్రిలో అలోపతి వైద్యునిగా నకిలీగా పనిచేస్తున్న హితేంద్ర పి. ఇరేన్ (బి.హెచ్.ఎం.ఎస్.)

మునిపల్లి పోలీస్ స్టేషన్ – సంగారెడ్డి జిల్లా:

ఎఫ్‌.ఐ.ఆర్. నెం: 112/2025 – బుదేరా ఎక్స్ రోడ్డు వద్ద క్లినిక్ (పేరు లేదు) నడుపుతున్న రవీంద్ర సిద్దప్ప షైడ్.

మర్పల్లి పోలీస్ స్టేషన్ – వికారాబాద్ జిల్లా: ఎఫ్‌.ఐ.ఆర్. నెం: 63/2025 – పట్లూర్ గ్రామం, మర్పల్లి వద్ద నామలేని క్లినిక్ నడుపుతున్న ఎన్. కుమార్.

సంగారెడ్డి టౌన్ పోలీస్ స్టేషన్:

ఎఫ్‌.ఐ.ఆర్. నెం: 221/2025 – సుష్రుత క్లినిక్, శివాజీ నగర్ వద్ద బి.ఎ.ఎం.ఎస్. విద్యార్హత ఉన్న ఆర్. ప్రభాకర్.

ఎఫ్‌.ఐ.ఆర్. నెం: 222/2025 – మక్దూమ్ నగర్ శాంతి నగర్ వద్ద ఆల్షిఫా క్లినిక్ నడుపుతున్న బి.యు.ఎం.ఎస్. వైద్యురాలు అయేషా బేగం.

సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్:

ఎఫ్‌.ఐ.ఆర్. నెం: 342/2025 – బైపాస్ రోడ్ వద్ద లైఫ్ పాలీక్లినిక్ నడుపుతున్న లోకేష్ (బి.ఎ.ఎం.ఎస్.)

హత్నూర పోలీస్ స్టేషన్ – సంగారెడ్డి జిల్లా:

ఎఫ్‌.ఐ.ఆర్. నెం: 107/2025 – శ్రీ రామ్ హాస్పిటల్ నడుపుతూ ఆలోపతి వైద్యం చేస్తున్న ఫార్మ్.డి. విద్యార్హత కలిగిన ఎస్. శ్రావ్య.

నర్సాపూర్ పోలీస్ స్టేషన్ – మెదక్ జిల్లా:

ఎఫ్‌.ఐ.ఆర్. నెం: 194/2025 – కె.ఎ.కె. హాస్పిటల్, నర్సాపూర్ లో ఆలోపతి వైద్యునిగా పనిచేస్తున్న బి.హెచ్.ఎం.ఎస్. విద్యార్హత కలిగిన కె. సాయి కిరణ్.

పటాంచెరు పోలీస్ స్టేషన్:

ఎఫ్‌.ఐ.ఆర్. నెం: 485/2025 – శ్రీ సాయి ఫస్ట్ ఎయిడ్ సెంటర్, ఇస్నాపూర్ ఎక్స్ రోడ్ వద్ద నడుపుతున్న బి. భాస్కర్.

ఎఫ్‌.ఐ.ఆర్. నెం: 486/2025 – శ్రీ శివ సాయి క్లినిక్ నడుపుతున్న జీవన్ రెడ్డి.

ఎఫ్‌.ఐ.ఆర్. నెం: 490/2025 – నాగమాత క్లినిక్ నడుపుతున్న పల్టూ బాల.

ఎఫ్‌.ఐ.ఆర్. నెం: 489/2025 – కాకతీయ హాస్పిటల్ లో ఆలోపతి వైద్యునిగా పనిచేస్తున్న పాల్ మహేంద్ర.

ఎఫ్‌.ఐ.ఆర్. నెం: 488/2025 – శ్రీ లక్ష్మి పాలీక్లినిక్ నడుపుతున్న జి. వెంకటస్వామి (బి.ఎ.ఎం.ఎస్.).

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *