‘సుప్రీం’ నిప్పు… ‘సోషల్’ ముప్పు – సుప్రీం సీజే గవాయ్‌ పై సోషల్ వార్

  • హిందూ వ్యతిరేకంటూ యూట్యూబర్ ఫైర్
  • పశ్చాత్తాపం లేదంటున్న బూటు వేసిన వ్యక్తి
  • దేశవ్యాప్తంగా వ్యతిరేక, సానుకూల స్పందన
  • గవాయ్ కు అనుకూలంగా పలుచోట్ల ర్యాలీలు

సహనం వందే, న్యూఢిల్లీ:
దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్ట్ కూడా మత ఘర్షణల మధ్య చిక్కుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌ పై న్యాయవాది బూటు వేసిన ఘటన అంతర్జాతీయంగా సంచలనం అయింది. ఈ ఘటనకు పాల్పడిన న్యాయవాది ఏ మాత్రం పశ్చాత్తాప పడటం లేదు. ఆ మేరకు ఆయన కొన్ని వార్తా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. ఇదిలా ఉంటే మరోవైపు సోషల్ మీడియాలో ప్రధాన న్యాయమూర్తిపై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది. వివాదాలకు కేంద్ర బిందువైన యూట్యూబర్ అజీత్ భారతి చేసిన వ్యాఖ్యలు అగ్గి రాజేశాయి. గవాయ్‌ అర్హత లేని న్యాయమూర్తిగా అభివర్ణిస్తూ తన వీడియోలో ఆయన చేసిన దాడి తీవ్ర విమర్శలకు దారితీసింది. దీంతో నోయిడా పోలీసులు మంగళవారం అజీత్ భారతిని విచారించి విడుదల చేశారు.

హిందూ వ్యతిరేకి అంటూ విష ప్రచారం…
అజీత్ భారతి తన వీడియోలో గవాయ్‌ను హిందూ వ్యతిరేక భావాలు కలిగిన న్యాయమూర్తిగా వ్యాఖ్యానించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి వ్యాఖ్యలు ఇలాగే కొనసాగితే రోడ్ల మీద కూడా దాడులు జరుగుతాయని ఆయన హెచ్చరించడం న్యాయవ్యవస్థకు సవాల్ విసిరినట్టే. భారతి యూట్యూబ్ ఛానల్‌లో ఏడు లక్షల మంది, ఎక్స్ (ట్విట్టర్)లో ఐదు లక్షల మంది అనుచరులు ఉండటంతో ఈ వ్యాఖ్యలు విస్తృతంగా వ్యాప్తి చెందాయి. తన అరెస్టు జరగలేదని… ఇదంతా వృత్తి ధర్మంలో ఒక భాగమేనని చెప్పుకున్నాడు. ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీలు దాడిని ఖండించిన సమయంలో భారతి వంటి వారి వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోస్తాయని అంటున్నారు. ఇలాంటి వ్యాఖ్యల నేపథ్యంలో సుప్రీంకోర్టు వర్సెస్ హిందూ కోడ్ అన్న విధంగా పరిస్థితి మారింది.

గతంలో రాహుల్ గాంధీపైన విమర్శలు
ప్రధాన న్యాయమూర్తికి వ్యతిరేకంగా అజీత్ భారతి చేసిన వ్యాఖ్యలు కొత్తేమీ కాదు. అతడు గత ఏడాది జూన్‌లో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీపై తప్పుడు ఆరోపణలు చేసి వివాదానికి తెర లేపాడు. రామ మందిర స్థానంలో బాబ్రీ మసీదును పునర్నిర్మించాలని రాహుల్ గాంధీ చెప్పారంటూ చేసిన ప్రచారంపై కర్ణాటక పోలీసులు కేసు నమోదు చేశారు. భారతి గతంలో ఓపిండియా హిందీ సంపాదకుడిగా పనిచేసిన కాలంలోనూ ముస్లిం మతాన్ని ఇస్లామిక్ ఉగ్రవాదంతో సమానం అనే వ్యాఖ్యలు చేయడంతో అతని ఎక్స్ అకౌంట్ (ట్విట్టర్ ఖాతా) సస్పెండ్ అయింది.

న్యాయస్థానంపై దాడులు… కోర్టు కేసులు
అజీత్ భారతి 2019లో అటార్నీ జనరల్ కెకె వేణుగోపాల్‌ను విమర్శిస్తూ పరువు నష్టం కేసు ఎదుర్కొన్నాడు. 2025 మేలో టీఎఫ్‌ఐ మీడియా వ్యవహారంపై రెండు కోట్ల పరువు నష్టం దావా దాఖలైంది. ఈ కేసులన్నీ భారతి వ్యాఖ్యలు చట్టపరమైన పరిమితులను దాటుతున్నాయని స్పష్టం చేశాయి. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద ఇలాంటి దూషణలు సామాజిక మాధ్యమాల్లో విషపూరిత వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. సామాజిక మాధ్యమాల ఇన్‌ఫ్లూయెన్సర్లపై కఠిన చట్టాలు అమలు చేయాలని డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు ప్రధాన న్యాయమూర్తి గవాయిపై జరిగిన దాడిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా అనేకచోట్ల ర్యాలీలు జరిగాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *