- ఇద్దరు స్నేహితులు.. రాజకీయ ప్రత్యర్థులు
- వారిద్దరి జీవిత కథతో ఏడో తేదీన రిలీజ్
- సోనీలివ్ లో తెలుగు, ఇతర భాషల్లో స్ట్రీమింగ్
సహనం వందే, హైదరాబాద్:
ఎలాంటి ప్రచారం లేకుండా ఆసక్తికరమైన రాజకీయ చిత్రం రాబోతుంది. పేర్లు చెప్పకపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు, వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ కథతో తెరకెక్కిన చిత్రం ‘మయసభ’. ఇద్దరు స్నేహితులు.. రాజకీయ ప్రత్యర్థులుగా ఎలా మారారనే ఆసక్తికర కథాంశంతో దీన్ని రూపొందించినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దర్శకుడు దేవా కట్టా దర్శకత్వంలో ఆది పినిశెట్టి, చైతన్యరావు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం సోనీలివ్ ఒరిజినల్ గా ఇది సిద్ధమైంది. ఆగస్టు 7వ తేదీ నుంచి ఇది స్ట్రీమింగ్ కు అందుబాటులోకి రానుంది. ఒక పాత్ర పేరు కృష్ణమ నాయుడు. పేదరికం, నత్తి లాంటి బలహీనతల్ని అధిగమించి నాయకుడిగా ఎదిగిన తీరును ఆసక్తిగా మలిచారు. ఏపీ చరిత్రను మలుపు తిప్పిన రాజకీయ పరిణామాల చుట్టూ దేవా కట్టా ఈ మూవీని తీర్చిదిద్దినట్లు ప్రచార చిత్రం చూస్తే అర్థమవుతోంది. సోనీలివ్లో తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.