ఆకాశంలో ఆట… ఇండిగో వేట! – గుత్తాధిపత్యానికి 6 విమాన సంస్థలు బలి!

  • హీరో రామ్ చరణ్ ట్రూజెట్ కూడా మూసివేత
  • భారీగా ఛార్జీలు పెంచుకునేలా ఇండిగో కుట్ర
  • పోటీ లేకపోవడంతో అంతా ఇష్టారాజ్యం
  • ప్రస్తుత విమానయాన సంక్షోభానికి కారణమిదే

సహనం వందే, హైదరాబాద్:

భారతీయ విమానయాన రంగంపై నీలినీడలు కమ్ముకున్నాయి. విమాన ప్రయాణాలను సామాన్యుడికి అందుబాటులోకి తెచ్చిన 6 ప్రముఖ సంస్థలు వరుసగా కుప్పకూలడం వెనుక కేవలం అప్పులు, ఇంధన ధరల పెరుగుదల వంటి ఆర్థిక అంశాలే కారణమా? లేక దేశీయ గగనతలాన్ని తమ గుప్పిట్లోకి తీసుకునేందుకు ప్రధాన సంస్థలు పన్నిన కుట్రనా? అన్న అనుమానాలున్నాయి. ఈ సంస్థల పతనం కేవలం వ్యాపార వైఫల్యం కాదు. మార్కెట్‌లో పోటీ లేకుండా చేసేందుకు పెద్ద సంస్థలు పన్నిన కుట్ర అనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. కింగ్‌ఫిషర్ వంటి లగ్జరీ సంస్థ అయినా… ఎయిర్ డెక్కన్ వంటి చౌక ధరల సంస్థ అయినా… రామ్ చరణ్ ట్రూజెట్ అయినా… ప్రతి సంస్థ ఆర్థిక సంక్షోభం పేరుతో మూతబడడం అనేక అనుమానాలకు తావిస్తోంది.

టికెట్ల దోపిడీ… గగనంలో గోల్మాల్!
ప్రస్తుతం ఇండిగో వంటి రెండు మూడు సంస్థలు మాత్రమే మార్కెట్లో అగ్రస్థానంలో ఉన్నాయి. పోటీ సంస్థలు లేకపోవడంతో టికెట్ ధరలను అడ్డూ అదుపూ లేకుండా పెంచుకునేందుకు ఈ ప్రధాన సంస్థలకు ఇప్పుడు అవకాశం దొరికింది. ఆ ఆరు విమానయాన సంస్థల పతనానికి ముందు కుట్రకు తెరతీసిన బడా విమాన సంస్థలు మార్కెట్లో దూకుడుగా వ్యవహరించడం, కొన్ని రూట్లలో టికెట్ల ధరలను కృత్రిమంగా తగ్గించడం వంటి చర్యల ద్వారా కొత్త సంస్థలను ఉద్దేశపూర్వకంగానే నష్టాల్లోకి నెట్టాయనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. చిన్న సంస్థలు ఈ ధరల యుద్ధాన్ని తట్టుకోలేక, అప్పుల ఊబిలో కూరుకుపోయి చివరికి గుత్తాధిపత్య సంస్థల ముందు లొంగిపోక తప్పని పరిస్థితి ఏర్పడింది.

Indigo India's Biggest Airlines

ఆరు సంస్థల అంతం వెనుక విషాద గాథ…

  • కింగ్‌ఫిషర్ ఎయిర్‌లైన్స్: 2012లో ఆర్థిక, భద్రతా కారణాల పేరిట మూతపడింది. కానీ పోటీ సంస్థల ఒత్తిడిని తట్టుకోలేకనే ఈ లగ్జరీ సంస్థ అప్పుల్లో కూరుకుపోయిందనేది ఒక వాదన.
  • జెట్ ఎయిర్‌వేస్: 2019లో సర్వీసులు నిలిపివేసింది. బలమైన జెట్‌ను కాపాడేందుకు బ్యాంకులు ప్రయత్నించినా ఏ ఒక్క ప్రధాన భాగస్వామి ముందుకు రాకపోవడం వెనుక మార్కెట్ శక్తుల ఒత్తిడి ఉందనేది విమర్శ.
  • గోఫస్ట్: 2023లో దివాలా పిటిషన్ వేసింది. ఇంజిన్ల సరఫరాలో జాప్యం, మరమ్మతులకు మద్దతు నిరాకరించడం వంటి చర్యలు కేవలం తయారీదారు వైఫల్యం మాత్రమే కాదని… దాని వెనుక బలమైన శక్తుల జోక్యం ఉందనేది ఆరోపణ.
  • ట్రూజెట్: రామ్ చరణ్ భాగస్వామ్యంలోని ఈ సంస్థ ప్రాంతీయ విమానాలను నడిపింది. కోట్లాది రూపాయల నష్టంతో 2022లో కార్యకలాపాలను నిలిపివేయడం వెనుక ప్రాంతీయ రూట్లలో సైతం ప్రధాన సంస్థలకు బలైందనే అభిప్రాయం ఉంది.
  • ఎయిర్ డెక్కన్: రూపాయికే విమాన ప్రయాణం అనే విప్లవాన్ని తెచ్చిన ఈ సంస్థ… కింగ్‌ఫిషర్ లో విలీనం తర్వాత దానితోపాటే కనుమరుగైంది.
  • పారామౌంట్ ఎయిర్‌వేస్: లీజు వివాదాలు, బకాయిల కారణంగా 2010లో సర్వీసులు నిలిపివేసింది.
Indian Airlines Performance 2025

ఇండిగో ఏకఛత్రాధిపత్యం: 64 శాతం ఆక్రమణ
ఇండిగో
తన ఆధిపత్యాన్ని చెలాయిస్తూంది. దేశీయ మార్కెట్ షేర్‌లో ఏకంగా 64 శాతం ఆక్రమించిన ఈ సంస్థ… దేశంలో అందుబాటులో ఉన్న అన్ని రూట్లలో దాదాపు 80 శాతం దాటి ఉంది. దేశవ్యాప్తంగా నడుస్తున్న 1,131 సెక్టర్లలో 900సెక్టర్లకి ఇండిగో విమానాలు ఎగురుతున్నాయి. ఇండిగో ఆపరేట్ చేస్తున్న 900 రూట్లలో ఏకంగా 514 రూట్లపై పూర్తి ఏకఛత్రాధిపత్యం ఉంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *