సహనం వందే, తమిళనాడు:
దేశంలో దేవాలయాలెన్నో చూశాం కానీ తమిళనాడులోని సేలంలో ఒక విచిత్రమైన గుడి వెలిసింది, ఇందులో ఏకంగా గ్రహాంతరవాసి (ఏలియన్) విగ్రహం ప్రతిష్టించారు. మల్లామూపంపట్టికి చెందిన లోగనాథన్ అనే వ్యక్తికి కలలో కనిపించిన నల్లని గ్రహాంతరవాసిని దేవతగా భావించి భూమికి 11 అడుగుల లోతులో ఈ ఆలయాన్ని నిర్మించాడు. శివుడు సృష్టించిన తొలి దేవత ఇదేనని… ఈ విగ్రహం భక్తులను, ప్రపంచాన్ని ప్రకృతి విపత్తుల నుంచి కాపాడుతుందని లోగనాథన్ ప్రచారం చేస్తున్నాడు. ఈ వింత ఆలయ వార్త సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
గ్రహాంతరవాసికి గుడి – ఇది తమిళనాడులో వింత!