వర్షంలోనూ ఆయిల్ పామ్ తోటల పరిశీలన

సహనం వందే, అశ్వారావుపేట:
ఆయిల్ పామ్ తోటల్లో జన్యపర లోపం ఉన్న మొక్కలను, ఆఫ్-టైప్ మొక్కలను గుర్తించేందుకు ఐఐఓపీఆర్ శాస్త్రవేత్తలు మంగళవారం నుంచి తిరిగి పరిశీలన ప్రారంభించారు. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా చెట్టుచెట్టుకూ తిరిగి పరిశీలించినందుకు ఆయిల్ పామ్ రైతులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ క్షుణ్ణమైన పరిశీలన వల్ల అశ్వారావుపేట ఆయిల్ పామ్ నర్సరీలో జరిగిన మోసాలకు, తద్వారా నష్టపోయిన రైతులకు న్యాయం జరుగుతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే రైతుల తోటల్లో ఆఫ్-టైప్, జన్యపర లోపం ఉన్న మొక్కలు లేవని తప్పుడు ప్రచారం చేసిన వారికి ఈ పరిశీలన కనువిప్పు కలిగిస్తుందని తెలంగాణ ఆయిల్ పామ్ రైతు సంఘం అభిప్రాయపడింది

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *