మిక్సోపథీ ప్రజారోగ్యానికి పెను ప్రమాదం

  • ఎంబీబీఎస్, ఆయుర్వేద కలిపి కోర్స్ వద్దు
  • తెలంగాణ జూడా డిమాండ్

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న మిక్సోపథీ విధానం ప్రజారోగ్యానికి తీవ్ర విఘాతం కలిగిస్తుందని తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (టీ-జూడా) విమర్శించింది. వైద్య విద్యను శాస్త్రీయత నుండి వేరుచేసే ఈ విధానాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు జూడా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. జూడా అధ్యక్షుడు డాక్టర్ ఐజాక్ న్యూటన్ ఈ విషయంపై వ్యాఖ్యానిస్తూ, ఆధునిక వైద్యం శాస్త్రీయ పరిశోధనల ఫలితంగా ఏర్పడిన ఘనమైన వ్యవస్థ అని ఉద్ఘాటించారు. ‘వైద్య విద్యార్థులకు సమగ్రంగా బోధించకపోతే, రేపటి వైద్యులు ప్రజల ప్రాణాలతో ఆడుకునే ప్రమాదం ఏర్పడుతుంది. మిక్సోపథీ ద్వారా విద్యార్థులు ఏ శాస్త్రాన్ని పూర్తిగా నేర్చుకుంటారో తెలియదు. తుదకు ప్రజలకు నిపుణులైన వైద్యులు దక్కక, అపాయం కగులుతుంద’ని హెచ్చరించారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *