
పాఠ్యపుస్తకాల్లో ‘మొఘలు’లకు మంగళం
సహనం వందే, ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం ఎన్సీఈఆర్టీ ఏడో తరగతి పాఠ్యపుస్తకాలను పూర్తిగా మార్చడం సంచలనంగా మారింది. ఈ పుస్తకాల్లో అనేక మార్పులు చేర్పులు చేశారు. నూతన పాఠ్య పుస్తకాల్లో మొఘల్ చక్రవర్తులు, ఢిల్లీ సుల్తానేట్‌కు సంబంధించిన సమస్త చరిత్రను తొలగించింది. ‘భూమి ఎలా పవిత్రమవుతుంద’నే కొత్త చాప్టర్ ను పొందుపరిచారు. ఈ చాప్టర్లో హిందూ, బౌద్ధ, సిక్కు, ఇస్లాం, క్రైస్తవ, జుడాయిజం, జోరాస్ట్రియన్ మతాలకు సంబంధించిన వివరాలు ఉంటాయి. అలాగే భారత్ సహా ఇతర దేశాల్లోని…