‘ఎగ్జిట్’ నాటకం… వెనుక కుతంత్రం – మాయాజాలం కాదు… మహా మోసం
సహనం వందే, హైదరాబాద్:ఎన్నికల ఫలితాల ప్రకటనకు ముందు ఉత్కంఠను అమాంతం పెంచే ఎగ్జిట్ పోల్స్ కేవలం ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించే తీర్పు కాదు. ఇది రాజకీయ, ఆర్థిక ప్రయోజనాల కోసం పకడ్బందీగా అల్లిన అంకెల జూదం. వీటి ఉద్దేశం.. రాజకీయ పార్టీలు, కార్పొరేట్ వర్గాలు తమ ఆర్థిక వ్యూహాలను అమలు చేసుకోవడమే. అంతేకాదు కౌంటింగ్‌కు ముందు తమ ప్రేక్షకులను, పాఠకులను నిలుపుకునేందుకు మీడియాకు పనికివస్తాయి. అందుకే దీనిని కేవలం ఉత్కంఠ కోసమే అనుకుంటే పొరపాటే. గోడ దూకే నాయకులకు…