రణబీర్, కత్రినా రహస్యాల రచ్చ – కత్రినా ‘కైఫ్’చ్చే ఫోటోలు బట్టబయలు

  • వెలుగులోకి వచ్చిన పదేళ్ల ప్రేమ రహస్యం
  • కంగుతిన్న బాలీవుడ్ ప్రముఖ హీరోలు
  • తమకు ప్రైవసీ లేదా అంటూ ప్రశ్నల వర్షం
  • డిజిటల్ యుగంలో ప్రైవసీ యుద్ధం

సహనం వందే, ముంబై:
బాలీవుడ్‌లో సెలబ్రిటీల జీవితాలు ఎప్పటికీ ఓ బహిరంగ పుస్తకమే. వారి వ్యక్తిగత జీవితంపై మీడియా, అభిమానుల ఆసక్తి ఎప్పుడూ ఉంటుంది. కానీ ఈ ఆసక్తి కొన్నిసార్లు హద్దులు దాటి సెలబ్రిటీల ప్రైవసీని ఉల్లంఘిస్తుంది. సరిగ్గా పదేళ్ల క్రితం బాలీవుడ్‌ను కుదిపేసిన రణబీర్ కపూర్, కత్రినా కైఫ్ ఫొటోల లీక్ సంఘటన వెనుక ఉన్న అసలు రహస్యం ఇప్పుడు బయటపడింది. ఆ ఫోటోలను టూరిస్టులో, పాపరాజీలో తీయలేదని… వారికి అత్యంత దగ్గరి వ్యక్తి లీక్ చేశాడని పాపరాజీ గురు మనవ్ మంగ్లానీ చేసిన వ్యాఖ్యలు బాలీవుడ్ వర్గాల్లో కలకలం సృష్టించాయి.

సంచలనం సృష్టించిన ఆ దృశ్యాలు…
2013లో రణబీర్ కపూర్, కత్రినా కైఫ్‌లు ఇబిజా బీచ్‌లో హాలిడేలో మూడ్ లో ఉన్నారు. బికినీలో ఉన్న కత్రినా, స్విమ్ షార్ట్స్‌లో ఉన్న రణబీర్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అప్పటివరకు తమ రిలేషన్‌షిప్‌ను గోప్యంగా ఉంచిన ఈ జంటకు ఈ ఫొటోలు పెద్ద షాక్‌నిచ్చాయి. ఈ ఫొటోలు వచ్చిన తర్వాతే వారి ప్రేమ వ్యవహారం అధికారికంగా ఖరారైనట్టైంది.

అయితే ఆ ఫొటోలు టూరిస్టులో, పాపరాజీనో తీసి లీక్ చేశారని అంతా భావించారు. కానీ ఇప్పుడు మంగ్లానీ ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు నిజం బయటపెట్టాడు. ఈ ఫొటోలను లీక్ చేసిన వ్యక్తి రణబీర్-కత్రినాకు అత్యంత సన్నిహితుడని మంగ్లానీ చెప్పడంతో బాలీవుడ్‌లో ఎవరిని నమ్మాలి అనే చర్చ మొదలైంది.

హద్దులు మీరిన హక్కులు…
మనవ్ మంగ్లానీ పాడ్‌కాస్ట్‌లో చెప్పిన విషయాలు మీడియా నైతికత, పాపరాజీ సంస్కృతిపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తాయి. సెలబ్రిటీలు ఎంత దాచినా వారు పబ్లిక్ ఫిగర్స్ కాబట్టి వారి జీవితంపై మీడియా నిఘా ఉంటుందని మంగ్లానీ వాదన. ఆదిత్య రాయ్ కపూర్, అనన్య పాండేల డేటింగ్ ఫొటోలు… విక్కీ కౌశల్, కత్రినా కైఫ్‌ల దీపావళి పార్టీ ఫొటోలను మొదట తానే తీశానని చెబుతూ… సెలబ్రిటీల ప్రైవసీని గౌరవించాల్సిన అవసరం లేదనే తరహాలో మాట్లాడాడు. ఈ ఫొటోలు తమకు ఆర్థికంగా లాభం తెచ్చిపెడతాయని బహిరంగంగానే చెప్పడం వివాదాస్పదంగా మారింది. సెలబ్రిటీలు బయట ఉన్నప్పుడు వారి వ్యక్తిగత క్షణాలను కూడా పబ్లిక్‌కు చూపించాలనే ఈ మీడియా ధోరణి ఎంతవరకు సమంజసమనే ప్రశ్న ఇప్పుడు బాలీవుడ్‌లో గట్టిగా వినిపిస్తోంది.

ఆవేదన వ్యక్తం చేసిన సెలబ్రిటీలు
తమ ఫొటోలు లీక్ అయిన తర్వాత రణబీర్, కత్రినా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కత్రినా ఒక బహిరంగ లేఖలో పబ్లిక్ ఫిగర్స్ కావచ్చు కానీ వారి వ్యక్తిగత అంశాలను మీడియా గౌరవించాలని కోరింది. రణబీర్ కూడా ఈ సంఘటనను విశ్వాస విచ్ఛిన్నం అని అభివర్ణించాడు. పబ్లిక్ లైఫ్, పర్సనల్ లైఫ్ మధ్య ఒక గీత ఉండాలని, మీడియా దాన్ని దాటకూడదని హితవు పలికాడు. అభిమానులు, నెటిజన్లు కూడా ఈ ప్రైవసీ ఉల్లంఘనపై విమర్శలు కురిపించారు. తమ వ్యక్తిగత జీవితంపై మీడియా చేస్తున్న ఈ అతి జోక్యంపై సెలబ్రిటీలు ఏకమవుతున్నారు.

డిజిటల్ యుగంలో ప్రైవసీ యుద్ధం…
డిజిటల్ యుగంలో మీడియా వేగం రెట్టింపు అయ్యింది. ఒక ఫోటో క్షణాల్లో వేలాది మందికి చేరుతోంది. రణబీర్-కత్రినా ఫొటోలు లీక్ అయినప్పుడు కూడా అదే జరిగింది. ఇది ఒక వ్యక్తిగత విషయం నుంచి సెలబ్రిటీల ప్రైవసీకి సంబంధించిన పెద్ద చర్చగా మారింది. లీక్ చేసేవారు, పబ్లిష్ చేసేవారు, చూసేవారు—ఈ ముగ్గురిలో ఎవరు తప్పు చేస్తున్నారనే విషయంపై స్పష్టత లేదు. మంగ్లానీ చెప్పినట్లుగా ఈ ఫొటోలు ఎలాగో బయటకు వస్తాయి కాబట్టి వాటిని ప్రచురించడంలో తప్పేమీ లేదనే వాదన సమంజసంగా అనిపించదు. ఈ సంఘటన భవిష్యత్తులో సెలబ్రిటీల ప్రైవసీ ఎలా ఉండబోతుందో ఒక సంకేతంలా కనిపిస్తోంది. సెలబ్రిటీలు తమ వ్యక్తిగత జీవితాలను కాపాడుకోవాలంటే భవిష్యత్తులో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *