ఎన్టీఆర్ విలన్… చివరికి హీరో

  • అభిమానులు తట్టుకోవడం కష్టమే
  • వార్-2 మొదటి సగం బాగుంది
  • తర్వాత కథంతా గందరగోళమే
  • ఎన్టీఆర్ కు హీరోయిన్ లేని చిత్రం

(రేటింగ్: 2.5/5)

సహనం వందే, హైదరాబాద్:
వార్-2 సినిమా మొదటి గంట సూపర్ గా ఉంది. హృతిక్ రోషన్ యాక్షన్ ఎక్సలెంట్. సినిమా మొదలైన అర గంటకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తన యాక్షన్ తో సినిమా హాల్లో కేక పుట్టించాడు. ఒక మనిషి ఇగోను కెలికితే ఎంత దూరమైనా వెళ్తాడు అనే ఎన్టీఆర్ డైలాగ్ బాగుంది. ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత ఎన్టీఆర్ విలన్ అని అర్థం అవుతుంది. రా ఇంటిలిజెన్స్ వ్యవస్థలో ఉంటూ గ్యాంగ్ స్టర్లకు సపోర్ట్ చేస్తుంటాడు. దీన్ని ఆర్మీలో కీలక స్థాయిలో ఉన్న హృతిక్ రోషన్ కనిపెడతాడు. విచిత్రం ఏంటంటే వీరిద్దరూ చిన్నప్పుడు అనాధలా ఉండి కలుసుకుంటారు. ఒక దొంగతనం కేసులో బాలల జైల్లో ఉంటారు. అక్కడ కౌన్సిలింగ్ పొంది ఆర్మీలో చేరుతాడు హృతిక్ రోషన్.

జూనియర్ ఎన్టీఆర్ కు అతని యాటిట్యూడ్ చూసి చేరేందుకు అవకాశం రాదు. దీంతో తన ఫ్రెండ్ తో తెగతెంపులు చేసుకుంటాడు ఎన్టీఆర్. తర్వాత వారిద్దరూ జీవితాంతం శత్రువులుగా ఉండిపోతారు. అయితే అర్థం కాని విషయం ఏంటంటే ఎన్టీఆర్ మళ్లీ ఎప్పుడు ఆర్మీలోకి వస్తాడన్నది అంతు పట్టదు. కానీ రాలో కీలకమైన పొజిషన్ ఉంటాడు. హృతిక్ రోషన్ మాత్రం ఇంటర్నల్ ఆపరేషన్స్ చేస్తుంటాడు. ఈ సినిమాలో విమానంపై ఫైట్ ఆసక్తికరంగా ఉంటుంది.

ఇక హృతిక్ రోషన్ ముందు ఎన్టీఆర్ తేలిపోయాడని చెప్పక తప్పదు. పైగా తెలుగు అభిమానులు ఆయనను విలన్ గా ఏమాత్రం అంగీకరిస్తారనేది అనుమానమే. అయితే చివరకు అతను చనిపోయాడని ప్రపంచానికి తెలియజేస్తారు. చావు అంచుకు చేరిన తర్వాత ఎన్టీఆర్ తన తప్పులు తెలుసుకొని దేశం కోసం పనిచేయడమే కరెక్ట్ అని మారిపోతాడు. అలా చివరకు ఆయనను కూడా హీరోగా ప్రజెంట్ చేశారు. ఇందులో హీరోయిన్ కియారా అద్వానీ పాత్ర అంతంతే. ఆమె హృతిక్ రోషన్ ను ప్రేమిస్తుంది. ఎన్టీఆర్ కు మాత్రం ఎలాంటి హీరోయిన్ ని పెట్టలేదు. ఆయన సినీ చరిత్రలో హీరోయిన్ లేకుండా నటించిన సినిమా ఇదేనని సినీ పండితులు అంటున్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *