భాజపా విజయానికి సోషల్ మీడియా కీలకం

సహనం వందే, హైదరాబాద్:
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడం ఖాయమని బీజేపీ ఓబీసీ మోర్చా నేషనల్ సోషల్ మీడియా మెంబర్ పెరిక సురేష్ అన్నారు. పార్టీ కార్యకలాపాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళడంలో సామాజిక మాధ్యమాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌లో పార్టీ ఐటీ, సోషల్ మీడియా విభాగాల ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పార్టీ బలోపేతానికి సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకోవాలని కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, బీజేపీ జాతీయ ప్రతినిధి ప్రేంశుక్లా, సామాజిక మాధ్యమాల దక్షిణ భారత ఇన్‌ఛార్జ్ గిరిరాజ్ వర్నేకర్, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *