ఏఐని నమ్మితే నట్టేటే – సుందర్ పిచాయ్ షాకింగ్ కామెంట్స్

  • కళ్లు మూసుకుని నమ్మొద్దు
  • బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏఐపై బాంబ్
  • అది కేవలం సమాచార వనరు మాత్రమే
  • క్రియేటివిటీ పనులకు చాలా ఉపయోగకరం
  • అయినా సమగ్ర సమాచార వ్యవస్థ అవసరం
  • ఏఐలో పెట్టుబడులు… కంపెనీలకు ముప్పు

సహనం వందే, అమెరికా:
ఏఐ విప్లవం ప్రపంచాన్ని చుట్టేస్తుంటే… గూగుల్ అధిపతి సుందర్ పిచాయ్ మాత్రం దాన్ని అంతగా నమ్మొద్దంటూ చేసిన వ్యాఖ్యలు ప్రపంచాన్ని నివ్వెర పరిచాయి. ‘ఏఐ అందించే సమాచారాన్ని కళ్లు మూసుకుని నమ్మొద్దు’ అని ఆయన వినియోగదారులకు సూచించడంపై టెక్నాలజీ వర్గాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాయి. ఏఐ వ్యవస్థలు ఇప్పటికీ తప్పులు చేస్తున్నాయని… వాటిని కేవలం ఒక సమాచార వనరుగా మాత్రమే పరిగణించాలని గూగుల్ సీఈఓ పిచాయ్ బీబీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఏఐపైనే పూర్తిగా ఆధారపడకుండా సమగ్ర సమాచార వ్యవస్థ అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. అందుకే ప్రజలు ఇప్పటికీ గూగుల్ సెర్చ్ వంటి వాటిని ఉపయోగిస్తున్నారని, అవి కచ్చితమైన సమాచారాన్ని అందించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాయని ఆయన అన్నారు.

ఏఐకి ఎన్నో పరిమితులు…
ఏఐ అనేది సృజనాత్మక పనులకు చాలా ఉపయోగకరంగా ఉంటుందని పిచాయ్ అంగీకరించారు, అయితే వినియోగదారులు దాని పరిమితులను తప్పక అర్థం చేసుకోవాలని సూచించారు. ఆ సాధనాలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి తప్ప అవి చెప్పే ప్రతిదానిని గుడ్డిగా విశ్వసించకూడదని ఆయన అన్నారు. గూగుల్ తన సెర్చ్ ఇంజిన్‌లో జెమిని ఏఐ మోడ్‌ను ప్రవేశపెట్టినప్పటికీ ప్రస్తుత అత్యాధునిక ఏఐ సాంకేతికత కొన్ని లోపాలకు గురవుతుందని ఆయన అంగీకరించారు. గూగుల్ సైతం కచ్చితమైన సమాచారాన్ని అందించడానికి చాలా కృషి చేస్తుందని, కానీ తప్పులు దొర్లే అవకాశం ఉందని ఒప్పుకోవడం ప్రస్తుత ఏఐ టెక్నాలజీ పరిమితులను తేటతెల్లం చేస్తోంది.

ఏఐ పెట్టుబడులు… అన్ని కంపెనీలకు ముప్పు
ఏఐ రంగంలో జరుగుతున్న భారీ పెట్టుబడుల ప్రవాహం గురించి పిచాయ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కాలం అద్భుతమైనదే అయినప్పటికీ డాట్‌కామ్ బూమ్-అండ్-బస్ట్ (డాట్‌కామ్ బుడగ పగిలిపోవడం) సమయంలో ఉన్నట్టే ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితి కనిపిస్తుందని అన్నారు. ఆ డాట్‌కామ్ సంక్షోభం చివరికి పరిష్కారమైనప్పటికీ… ప్రస్తుతం ఏఐ పెట్టుబడులలో ఉన్న బుడగ పగిలిపోతే దాని ప్రభావం ప్రతి కంపెనీపై ఉంటుందని హెచ్చరించారు. ఈ ఏఐ బుడగ పగిలితే గూగుల్ తప్పించుకోగలదా అని అడిగిన ప్రశ్నకు, ‘మాతో సహా ఏ కంపెనీ కూడా దీనికి అతీతం కాదు’ అని పిచాయ్ స్పష్టం చేశారు.

టెక్నాలజీ చైన్‌పై నియంత్రణే గూగుల్ బలం
ఏఐ మార్కెట్‌లో ఏవైనా సమస్యలు ఎదురైనా తమ సంస్థకు తన టెక్నాలజీ చైన్ మొత్తాన్ని నియంత్రించే సామర్థ్యం ఉందని పిచాయ్ ధీమా వ్యక్తం చేశారు. చిప్స్, డేటా, ఏఐ మోడల్స్ నుండి అధునాతన పరిశోధనల వరకు అన్నింటిపై పూర్తి నియంత్రణ ఉండటం తమ బలం అని ఆయన అన్నారు. ఈ శక్తి కారణంగానే ఏఐ మార్కెట్‌లో వచ్చే ఎలాంటి టర్బ్యులెన్స్ (అస్థిరత)ను అయినా తట్టుకునే బలమైన స్థితిలో గూగుల్ ఉందని ఆయన పేర్కొన్నారు. ఏఐపై ప్రపంచంలో ఇంత పెట్టుబడి ప్రవాహం జరుగుతున్నప్పుడు ఏఐ వ్యవస్థల కచ్చితత్వం, పెట్టుబడుల స్థిరత్వంపై పిచాయ్ చేసిన ఈ వ్యాఖ్యలు టెక్ ప్రపంచానికి ఒక గట్టి వార్నింగ్ అని చెప్పవచ్చు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *