‘అబీర్ గులాల్’ విడుదలకు కేంద్రం బ్రేక్!

పాకిస్థానీ నటుడు ఫవాద్ ఖాన్‌ ప్రధాన పాత్రలో నటించిన బాలీవుడ్ చిత్రం ‘అబీర్ గులాల్’ భారతదేశంలో విడుదల కాదని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మే 9న విడుదల కావాల్సిన ఈ సినిమాపై ఫవాద్ ఖాన్ నటనకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో వాణీ కపూర్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తోంది.

ఉగ్రదాడితో భగ్గుమన్న ఆగ్రహజ్వాలలు…

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఇటీవల నలుగురు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహానికి కారణమైంది. ఈ నేపథ్యంలో పాకిస్థానీ నటుడు నటించిన సినిమాను భారత్‌లో విడుదల చేయడం సరికాదని దేశంలోని సినీ అభిమానులు, జాతీయవాదులు గట్టిగా వాదిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఏప్రిల్ 1న విడుదలైనప్పటి నుంచే వివాదాల సుడిగుండంలో చిక్కుకుంది. ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ కూడా ఈ చిత్ర విడుదలను బహిరంగంగా వ్యతిరేకించింది.

సోషల్ మీడియాలో భగ్గుమన్న నిరసనలు… బహిష్కరణ డిమాండ్‌తో వెల్లువెత్తిన ఆగ్రహం!
సామాజిక మాధ్యమ వేదిక ట్విట్టర్‌లో చాలా మంది యూజర్లు ‘అబీర్ గులాల్’ సినిమాను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. కొందరు ఫవాద్ ఖాన్ గతంలో ఆర్టికల్ 370 రద్దుపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, ఈ సినిమాను పూర్తిగా నిషేధించాలని కోరారు

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *