త్రిష… విజయ్… కీర్తి సురేష్

Share

  • సినీ నటుడు విజయ్ పార్టీ టీవీకేపై సెటైర్లు
  • టీ అంటే త్రిష… వీ అంటే విజయ్… కే అంటే కీర్తి సురేష్
  • తమిళనాడులో అధికార డీఎంకే వినూత్న విమర్శలు

తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ అంతే.. సినిమా తారల మెరుపులు, పంచ్‌ డైలాగుల్లాంటి వ్యాఖ్యలతో రసవత్తరంగా సాగుతుంటాయి. తాజాగా తమిళనాడు సినీ నటుడు విజయ్ పార్టీ తమిళగ వెట్ట్రి కళగం (టీవీకే) పేరుపై ఓ మంత్రి చేసిన కామెంట్లు అగ్గి రాజేశాయి. వ్యవసాయశాఖ మంత్రి ఎంఆర్‌కే పన్నీర్‌సెల్వం..‌. విజయ్‌ రాజకీయ ఎంట్రీని జీర్ణించుకోలేకపోయారో ఏమో ఏకంగా ఆయన పార్టీ పేరును బద్నాం చేశారు.

టీవీకే అంటే త్రిష, కీర్తి సురేషేనా సారూ?
ఓ పబ్లిక్ మీటింగ్‌లో మంత్రి మైక్ అందుకుని, ‘టీవీకే అంటే ఏమిటండీ?’ అని అమాయకంగా అడిగేశారు. ముందు వెనుకా చూసుకోకుండా కొందరు ఆడియన్స్ త్రిషా, కీర్తి సురేష్ అంటూ సరదాగా సమాధానమిచ్చారు. అంతే… మంత్రికి దొరికింది బ్రహ్మాండమైన ఛాన్స్. ఆడియన్స్ తెలివితేటలను మెచ్చుకుంటూనే, విజయ్‌ పార్టీ పేరు ఏదో హీరోయిన్ల పేర్లతో ముడిపడి ఉందన్నట్లుగా చమత్కరించారు. ఇక అంతే సంగతులు… సోషల్ మీడియాలో విజయ్ ఫ్యాన్స్ భగ్గుమన్నారు. ‘మా హీరో పార్టీ పేరును అలా అంటారా?’ అంటూ తెగ ఫీలయిపోయారు.

బ్లాక్ మనీతో రాజకీయాలు చేస్తూ నీతులా?
ఇక్కడితో ఆగితే మంత్రి ఎలా అవుతారు చెప్పండి? విజయ్‌ ఆదాయంపై కూడా ప్రశ్నలు సంధించారు. ‘అవినీతి గురించి మాట్లాడే ఈయన, బ్లాక్ మనీ తీసుకుని ఇప్పుడు మాకు నీతులు చెబుతున్నాడా?’ అంటూ సూటిగా విమర్శించారు. దీంతో విజయ్‌ పొలిటికల్ జర్నీలో మరో కొత్త కాంట్రవర్సీ మొదలైంది.

ఎక్స్ వేదికగా అభిమానుల ఆగ్రహం…
సోషల్ మీడియాలో ముఖ్యంగా ఎక్స్‌లో అయితే రచ్చ రచ్చ. విజయ్ అభిమానులు మంత్రి కామెంట్లను వ్యక్తిగత దాడిగా భావిస్తున్నారు. ‘మా విజయ్ ప్రజల కోసమే వచ్చాడు… దీంతో డీఎంకేకి భయం పట్టుకుంది’ అంటూ తెగ కామెంట్లు పెడుతున్నారు. రాజకీయ విశ్లేషకులు మాత్రం 2026 ఎన్నికల్లో టీవీకే ఒక కీలక శక్తిగా ఎదుగుతుందని అంచనా వేస్తున్నారు. కానీ ప్రస్తుతానికైతే ఈ కామెంట్ల యుద్ధం ఎటు దారి తీస్తుందో చూడాలి.


Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *