నిషిద్ధ పుస్తకం నిప్పుల వర్షం – రాహుల్ చేతిలో రహస్య ప్రతి

Naravane Book Four Stars of Destiny at Rahul Hands
  • ఢిల్లీని వణికిస్తున్న ‘నరవణే’ డైరీ
  • మార్కెట్లో ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ సంచలనం
  • గాల్వన్ లోయలో ఆరోజు ఏం జరిగింది?
  • ఆ రాత్రి ప్రధాని ఎందుకు మౌనంగా ఉన్నారు?
  • అగ్నిపథ్ మాకొద్దు అన్నా మోడీ వినలేదు…
  • మాజీ సైన్యాధిపతి నరవణే సంచలన రాతలు
  • పెంగ్విన్ గుట్టురట్టు.. రక్షణ రహస్యాలపై రచ్చ

సహనం వందే, హైదరాబాద్:

భారత రాజకీయ యవనికపై ‘ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ’ పుస్తకం ఒక అణుబాంబులా పేలింది. మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే రాసిన ఈ ఆత్మకథలోని అంశాలు మోదీ ప్రభుత్వ పునాదులను కదిలిస్తున్నాయి. రక్షణ శాఖ ఆమోదం తెలుపని ఈ నిషేధిత పుస్తకం ఇప్పుడు పార్లమెంటు నుంచి గల్లీ దాకా దద్దరిల్లేలా చేస్తోంది. సరిహద్దుల్లో చైనాతో జరిగిన ఘర్షణలు, దేశీయంగా తెచ్చిన సైనిక సంస్కరణల వెనుక ఉన్న చేదు నిజాలు ఇప్పుడు బయటపడుతున్నాయి.

Four Stars of Destiny - Naravane Book

గాల్వన్… ఆ రాత్రి ఏం జరిగింది?
2020 జూన్ 15 రాత్రి గాల్వన్ లోయలో 20 మంది భారత జవాన్ల వీరమరణం వెనుక రాజకీయ నాయకత్వ వైఫల్యం ఉందని నరవణే తన పుస్తకంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా దళాలు భారత భూభాగంలోకి దూసుకువస్తుంటే పైస్థాయి నుండి స్పష్టమైన ఆదేశాలు రాలేదని ఆయన వెల్లడించారు. ‘మీకు ఏది ఉచితం అనిపిస్తే అది చేయండి’ (జో ఉచిత్ సమ్జో వో కరో) అంటూ ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ చేతులెత్తేశారని… నిర్ణయాధికారాన్ని తనకే వదిలేసి తప్పుకున్నారని ఆయన రాశారు. ఇది బాధ్యతల నుండి పారిపోవడమేనని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

అగ్నిపథ్ వెనుక అసలు కథ…
సైన్యాన్ని కుంగదీస్తున్న అగ్నిపథ్ పథకంపై నరవణే తన పుస్తకంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. కేవలం 25 శాతం మందిని మాత్రమే కొనసాగించడం సైన్యానికి నష్టం కలిగిస్తుందని తాను హెచ్చరించినా ప్రభుత్వం వినలేదని ఆయన రాశారు. జవాన్లకు ఇచ్చే 20 వేల రూపాయల జీతం వారి త్యాగానికి ఇచ్చే విలువ కాదని… అది దినసరి కూలీ కంటే తక్కువని ఆయన మండిపడ్డారు. ఈ రాతలు ఇప్పుడు సైన్యంలో, నిరుద్యోగ యువతలో పెద్ద చర్చకు దారితీశాయి.

రాహుల్ చేతికి ఎలా వచ్చింది?
రక్షణ శాఖ ఆమోదం తెలపని ఈ పుస్తక ప్రతిని రాహుల్ గాంధీ పార్లమెంటులో ప్రదర్శించడం పెద్ద వివాదంగా మారింది. ‘ప్రభుత్వం లేదంటున్న పుస్తకం నా చేతిలో ఉంది’ అంటూ ఆయన కెమెరాలకు చూపించారు. విదేశీ వెబ్‌సైట్లలో ఈ పుస్తకం పీడీఎఫ్ రూపంలో లభ్యమవుతోందని రాహుల్ స్పష్టం చేశారు. ఒక మాజీ సైన్యాధిపతి రాసిన కీలక పత్రాలు ఇలా లీక్ అవ్వడం వెనుక ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉందా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనిపై ఢిల్లీ పోలీసులు నమ్మకద్రోహం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బయటపడుతున్న లోతైన రహస్యాలు
ఈ పుస్తకంలో కేవలం గాల్వన్ మాత్రమే కాదు… డోక్లాం ప్రతిష్టంభన సమయంలో చైనా జరిపిన అక్రమ నిర్మాణాల గురించి కూడా నరవణే కుండబద్దలు కొట్టారు. సరిహద్దుల్లో చైనా మన భూభాగాన్ని ఆక్రమిస్తున్నా ప్రభుత్వం ప్రజలకు వాస్తవాలు చెప్పడం లేదని ఈ పుస్తకం ద్వారా స్పష్టమవుతోంది. ఇది కేవలం రాజకీయ వివాదం కాదు… దేశ సార్వభౌమాధికారానికి సంబంధించిన అంశమని మేధావులు హెచ్చరిస్తున్నారు.

కేంద్రానికి పెద్ద తలనొప్పి…
ఈ పరిణామాలన్నీ చూస్తుంటే నరవణే డైరీ కేంద్ర ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారేలా ఉంది. ఒక పక్క నరవణే తన పుస్తకానికి మంచి పేరు వస్తుందని వ్యాఖ్యానిస్తుండగా… ప్రభుత్వం మాత్రం దానిని నొక్కేయాలని చూస్తుందని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ఈ పుస్తకాన్ని ప్రధానికి గిఫ్ట్ ఇస్తానని చెప్పడం ఈ పోరాటం మరింత ముదిరేలా చేస్తోంది.

బొల్లోజు రవి, సీనియర్ జర్నలిస్ట్

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *