కొత్తగా 4201 పీజీ మెడికల్ సీట్లు – తెలంగాణకు 353 సీట్లు

PG Medical Seats
  • దేశవ్యాప్తంగా ప్రైవేట్ లో భారీగా పెరుగుదల

సహనం వందే, న్యూఢిల్లీ:
దేశంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్లు భారీగా పెరిగాయి. ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో 4201 కొత్త పీజీ సీట్లకు ఎన్‌ఎంసీ ఆమోదం తెలిపింది. 2025-26 విద్యా సంవత్సరానికి బ్రాడ్ స్పెషాలిటీల్లో ఈ సీట్లు అందుబాటులోకి వస్తాయి. మెడికల్ అసెస్‌మెంట్ అండ్ రేటింగ్ బోర్డు ఈ పూర్తి జాబితాను తమ వెబ్‌సైట్‌లో ఉంచింది.

రాష్ట్రాల వారీగా వివరాలు ఇలా…
ఈ కొత్త సీట్లను రాష్ట్రాల వారీగా విభజించారు. కర్ణాటకకు అత్యధికంగా 712 సీట్లు దక్కగా, ఉత్తరప్రదేశ్‌కు 613, తమిళనాడుకు 418, తెలంగాణకు 353, మధ్యప్రదేశ్‌కు 368 సీట్లు మంజూరయ్యాయి. చిన్న రాష్ట్రాలైన త్రిపురకు 10, పుదుచ్చేరికి 7, ఒడిశాకు 43 సీట్లు మాత్రమే లభించాయి. ఈ కొత్త సీట్లకు అనుమతి ఉత్తరాలు జారీ చేసే ప్రక్రియ ఇంకా జరుగుతున్నప్పటికీ కౌన్సెలింగ్ అథారిటీలు వాటి కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదని ఎన్ఎంసీ స్పష్టం చేసింది. కమిషన్ వెబ్‌సైట్‌లోని జాబితాను పరిగణనలోకి తీసుకుంటే చాలని తెలియజేసింది.

స్పెషాలిటీల వారీగా సీట్లు
స్పెషాలిటీల వారీగా చూసినా సీట్ల పెరుగుదల గణనీయంగా ఉంది. ఎంఎస్ ఆర్థోపెడిక్స్‌లో 355, ఎండీ అనస్థీషియాలజీలో 318, ఎండీ రేడియో డయాగ్నసిస్‌లో 314 సీట్లు కల్పించారు. ఎండీ జనరల్ మెడిసిన్‌లో 283, ఎంఎస్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీలో 282 సీట్లు వచ్చాయి. ఇక ఎండీ పీడియాట్రిక్స్‌లో 296, ఎండీ డెర్మటాలజీ వెనిరియాలజీ అండ్ లెప్రసీలో 240, ఎంఎస్ ఆప్తల్మాలజీలో 238, ఎంఎస్ జనరల్ సర్జరీలో 251 సీట్లు కొత్తగా మంజూరయ్యాయి. మరోవైపు ఎండీ ఫ్యామిలీ మెడిసిన్‌లో 2, ఎండీ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్‌లో 4, ఎండీ న్యూక్లియర్ మెడిసిన్‌లో 8, ఎండీ ఫిజికల్ మెడిసిన్ అండ్ రిహాబిలిటేషన్‌లో 7 సీట్లు ఇచ్చారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *