1న పింఛన్ విద్రోహ దినం – సభా పోస్టర్ విడుదల చేసిన నేతలు

సహనం వందే, హైదరాబాద్:
వచ్చే నెల 1వ తేదీన పింఛన్ విద్రోహ దినం సభను విజయవంతం చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆదేశాల మేరకు ఉద్యోగ జేఏసీ హైదరాబాద్ నగర, జిల్లా శాఖలు మంగళవారం ఆర్థిక, గణాంకాల కార్యాలయంలో గోడపత్రికను ఆవిష్కరించాయి. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఉద్యోగ జేఏసీ చైర్మన్లు శ్రీకాంత్, విక్రమ్, కన్వీనర్లు వెంకట్, కృష్ణ యాదవ్‌తో పాటు టీజీఓ, టీఎన్జీఓ వంటి ఇతర సంఘాల నాయకులు మాట్లాడారు.

ఆ రోజు నల్ల దుస్తులతో నిరసన…
లలిత కళాతోరణం వద్ద జరిగే సభకు నల్ల రంగు దుస్తులు ధరించి రావాలని ఉద్యోగ సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. తమ హక్కులను సాధించుకోవడానికి ఐక్యంగా ఉండాలని కోరారు. పెన్షన్ విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఏకతాటి పైకి వచ్చి పోరాడాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో అమరేందర్, రాజు, వేణుమాధవ్, విద్యా సాగర్, నరసింహాచారి, నందిని, కవిత, బెరిల్, నగేశ్ వంటి పలువురు నాయకులు పాల్గొన్నారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *