సహనం వందే, హైదరాబాద్:
సాధారణంగా జీవితంలో డబ్బు, పేరు ప్రతిష్టలు సంపాదించిన తర్వాత చాలా మంది సుఖంగా గడపాలనుకుంటారు. కానీ కొంతమంది మాత్రం తాము నిలదొక్కుకున్న తర్వాత సమాజానికి తమ వంతు ఏదైనా చేయాలని భావిస్తారు. అలాంటి వారిలో ఒకరు ఇస్టా డిజిటల్ మీడియా వ్యవస్థాపకుడు మణి కుమార్. బీటెక్ పూర్తి చేసి, విజయవంతమైన మొబైల్ వ్యాపారంతో మంచి ఆదాయం, పేరు సంపాదించిన మణి… కేవలం డబ్బు సంపాదనకు పరిమితం కాకుండా, వైద్యులకు సేవ చేయాలనే గొప్ప సంకల్పంతో కొత్త ప్రయాణం ప్రారంభించారు.

సేవలో సంతృప్తిని వెతుక్కుంటూ…
మణి కుమార్ తన స్థిరమైన వ్యాపారాన్ని విడిచిపెట్టి వైద్యులకు అంకితమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఇస్టా డిజిటల్ మీడియాను స్థాపించారు. రోగుల ప్రాణాలు నిలబెట్టడానికి వైద్యులు పడే శ్రమ, అంకితభావం సమాజంలో మరింత గుర్తింపు పొందాలని ఆయన బలంగా విశ్వసించారు. ఆ నమ్మకంతోనే ఆయన ఇస్టా డాక్టర్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ అనే ప్రత్యేక వేదికను సృష్టించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ పురస్కారాలు వైద్య సమాజంలో విశేషమైన ఆదరణ పొందుతున్నాయి. ఎంతోమంది ప్రముఖ వైద్యులు ఈ వేదికపై సత్కారాలు అందుకుని, తమ అనుభవాలను పంచుకున్నారు.
వైద్య ప్రపంచంలో కొత్త అధ్యాయం…
ఇస్టా డాక్టర్స్ ఎక్సలెన్స్ అవార్డ్స్ కేవలం వైద్యులకు గౌరవం ఇవ్వడమే కాదు, వైద్య రంగంలో కొత్త పరిశోధనలు, సాంకేతిక ఆవిష్కరణలు, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలను కూడా ప్రోత్సహిస్తున్నాయి. ప్రతి సంవత్సరం అత్యుత్తమ ప్రతిభావంతులైన వైద్యులను గుర్తించి సత్కరించడం ద్వారా ఈ అవార్డులు వైద్య సమాజంలో ఒక ప్రతిష్టాత్మక పురస్కారంగా మారాయి. ‘వైద్యులకు సేవ చేయడం అంటే మానవాళికి సేవ చేయడమే’ అనే గొప్ప ఆలోచనతో మణి కుమార్ ముందుకు సాగుతున్నారు. భవిష్యత్తులో మరిన్ని వైద్య సంబంధిత కార్యక్రమాలు ప్రారంభించి, ఆరోగ్య రంగానికి కొత్త దిశ చూపాలనే సంకల్పంతో ఆయన ఉన్నారు. ఆయన కృషి, అంకితభావం ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నాయి.