అసెంబ్లీకి రారు… ప్రజల వద్దకు పోరు

  • అయినా కేసీఆర్ గ్రేట్… రాష్ట్ర ఎమ్మెల్యేల్లో కేసీఆర్ కు రెండో ర్యాంకుపై రాజకీయ రగడ
  • మాజీ ముఖ్యమంత్రి మేనల్లుడు హరీష్ రావుకు ఫస్ట్ ర్యాంక్… బీఆర్ఎస్ కు సర్వే జై
  • పీపుల్స్ పల్స్-సౌత్ ఫస్ట్ సంస్థలు ఆధ్వర్యంలో తెలంగాణలో సర్వే
  • 118 మంది ఎమ్మెల్యేల ర్యాంకింగ్ పై రాజకీయ ప్రకంపనలు
  • మూడింట రెండొంతుల ఎమ్మెల్యేల పనితీరుపై అసంతృప్తి
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టచ్ చేయని సర్వే నిర్వాహకులు… భయమా?

సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణలో ఎమ్మెల్యేల పనితీరుపై పీపుల్స్ పల్స్-సౌత్ ఫస్ట్ సంస్థలు నిర్వహించిన సర్వే రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. పాలక, ప్రతిపక్ష పార్టీల పనితీరుపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుండగా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రెండో స్థానంలో నిలవడం తీవ్ర దుమారానికి రేకెత్తిస్తోంది. కేసీఆర్ అసెంబ్లీకి హాజరుకావడం లేదని, ప్రజల్లో కూడా తిరగడం లేదని విమర్శలు వస్తున్నప్పటికీ, సర్వేలో ఆయనకు రెండో స్థానం దక్కడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఇక కేసీఆర్ మేనల్లుడు ఎమ్మెల్యే హరీష్ రావు మొదటి స్థానంలో ఉండడం గమనార్హం. ఈ సర్వేలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియోజకవర్గాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకోలేదన్న చర్చ జరుగుతుంది. ఆయన నియోజకవర్గాన్ని సర్వే నిర్వాహకులు టచ్ చేయకపోవడం గమనార్హం. దానికి కారణం భయమా? లేక ఇంకేమైనా ఉందా? రేవంత్ రెడ్డికి కూడా ర్యాంకింగ్ ఇవ్వాల్సి వస్తే… హరీష్ రావు, కేసీఆర్ ల ర్యాంకులు ఎలా ఉండేవి?

సర్వే నిర్వహణా పద్ధతి…
పీపుల్స్ పల్స్ సంస్థ-సౌత్ ఫస్ట్ వెబ్ సైట్ మార్చి 28 నుండి ఏప్రిల్ 3 వరకు 118 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం మినహాయించింది. ప్రతి నియోజకవర్గంలో 450 నుండి 500 మంది ప్రజల అభిప్రాయాలను కంప్యూటరైజ్డ్ అసిస్టెడ్ టెలిఫోనిక్ ఇంటర్వ్యూస్ (క్యాటీ) / ఐవీఆర్ఎస్ ద్వారా సేకరించారు. ఈ సర్వేలో పురుషులు, మహిళలకు సమాన ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉంది అనే అంశంపై మాత్రమే ఈ సర్వే జరిగింది.

ఎమ్మెల్యేలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి…
సర్వే ఫలితాలు ప్రజల్లో ఎమ్మెల్యేల పనితీరుపై తీవ్ర అసంతృప్తిని వెల్లడిస్తున్నాయి. 118 మంది ఎమ్మెల్యేల్లో మూడింట రెండొంతుల మంది పనితీరు బాగాలేదని లేదా సగటుగా ఉందని ప్రజలు తేల్చిచెప్పడం ఆందోళన కలిగిస్తోంది. ఎన్నికలు జరిగిన 15 నెలల కాలంలోనే ఇలా అసంతృప్తి ఉండడం శోచనీయం. పాలక కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు మాత్రమే టాప్ 10 జాబితాలో ఉండటం ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతకు అద్దం పడుతోంది.

ఎమ్మెల్యేల పనితీరుకు కొలమానాలు…
ఈ సర్వేలో ఎమ్మెల్యేల పనితీరును పలు అంశాల ప్రాతిపదికన అంచనా వేయడం జరిగింది. ప్రజల నుండి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఎమ్మెల్యేల పనితీరును చాలా మంచి, పర్వాలేదు, బాగాలేదు అనే మూడు ప్రధాన వర్గాలుగా విభజించారు. 0.01 లేదా అంతకంటే ఎక్కువ రేటింగ్ ఉంటే దానిని మంచి పనితీరుగా పరిగణించారు. 0.00 నుండి -10% మధ్య రేటింగ్ ఉంటే దానిని పర్వాలేదు అని, -10% కంటే తక్కువ రేటింగ్ ఉంటే దానిని బాగాలేదు అని పరిగణనలోకి తీసుకున్నారు.

టాప్ 10 ఎమ్మెల్యేలు…

  • 1.టి. హరీష్ రావు (బీఆర్ఎస్)
  • 2.కేసీఆర్ (బీఆర్ఎస్)
  • 3.డి. శ్రీధర్ బాబు (కాంగ్రెస్)
  • 4.అక్బరుద్దీన్ ఒవైసీ (ఎంఐఎం)
  • 5.వి. ప్రశాంత్ రెడ్డి (బీఆర్ఎస్)
  • 6.పి. రాజేశ్వర్ రెడ్డి (బీఆర్ఎస్)
  • 7.కేటీఆర్ (బీఆర్ఎస్)
  • 8.పి. శంకర్ (బీజేపీ)
  • 9.ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి (కాంగ్రెస్)
  • 10.కె. వెంకట రమణ రెడ్డి (బీజేపీ)

పార్టీల వారీగా ఎమ్మెల్యేల పనితీరు

  • కాంగ్రెస్: ఏడుగురు ఎమ్మెల్యేల పనితీరు బాగుండగా, 20 మంది పనితీరు బాగాలేదని, 37 మంది పనితీరు పర్వాలేదని తేలింది.
  • బీఆర్ఎస్: 12 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగుండగా, 13 మంది పనితీరు బాగాలేదని, 13 మంది పనితీరు పర్వాలేదని సర్వేలో వెల్లడైంది.
  • బీజేపీ: ముగ్గురు ఎమ్మెల్యేల పనితీరు బాగుండగా, ఒక ఎమ్మెల్యే పనితీరు బాగాలేదని, నలుగురు ఎమ్మెల్యేల పనితీరు పర్వాలేదని తేలింది.
  • ఎంఐఎం: ఇద్దరు ఎమ్మెల్యేల పనితీరు బాగుండగా, ఇద్దరి పనితీరు బాగాలేదని, ముగ్గురు ఎమ్మెల్యేల పనితీరు పర్వాలేదని తేలింది.
  • సీపీఐ: ఒక ఎమ్మెల్యే పనితీరు పర్వాలేదని సర్వేలో తేలింది.

సర్వేలో వెల్లడైన ఇతర అంశాలు

  • బీసీ సామాజిక వర్గం టాప్ 10 ఎమ్మెల్యేల్లో నలుగురు పాలక పార్టీకి చెందిన వారు కాగా, ముగ్గురు బీఆర్ఎస్ కు చెందిన వారు, ముగ్గురు బీజేపీకి చెందిన వారు ఉన్నారు.
  • ఎస్సీ సామాజిక వర్గం ఎమ్మెల్యేల్లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క మొదటి స్థానంలో ఉన్నారు.
  • ఎస్టీ సామాజిక వర్గం ఎమ్మెల్యేల్లో మంత్రి సీతక్క మొదటి స్థానంలో, ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య రెండో స్థానంలో ఉన్నారు.
  • మహిళా ఎమ్మెల్యేలలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మొదటి స్థానంలో ఉండగా, మంత్రి సీతక్క రెండో స్థానంలో ఉన్నారు.

బీసీ ఎమ్మెల్యేలలో…

  • పొన్నం ప్రభాకర్ (కాంగ్రెస్) – 3వ స్థానం
  • గంగుల కమలాకర్ (బీఆర్ఎస్) – 4వ స్థానం
  • శ్రీనివాస్ యాదవ్ (బీఆర్ఎస్) – 5వ స్థానం
  • బీర్ల ఐలయ్య (కాంగ్రెస్) – 6వ స్థానం
  • టి. పద్మారావ్ (బీఆర్ఎస్) – 7వ స్థానం
  • ఆది శ్రీనివాస్ (కాంగ్రెస్) – 8వ స్థానం
  • వాకిటి శ్రీహరి (కాంగ్రెస్) – 9వ స్థానం
  • రాజాసింగ్ (బీజేపీ) – 2వ స్థానం
  • రామారావు పవార్ (బీజేపీ) – 10వ స్థానం

ఎస్సీ ఎమ్మెల్యేలలో…

  • మేడిపల్లి సత్యం – 2వ స్థానం
  • అడ్లూరి లక్ష్మణ్ కుమార్ – 3వ స్థానం
  • వంశీ కృష్ణ – 4వ స్థానం
  • వేముల వీరేశం – 5వ స్థానం
  • దామోదర్ రాజనర్సింహా – 6వ స్థానం
  • నాగరాజ్ – 7వ స్థానం
  • గడ్డం వివేకానంద – 8వ స్థానం
  • కడియం శ్రీహరి – 9వ స్థానం
  • లక్ష్మీకాంత్ రావు – 10వ స్థానం ఎస్టీ ఎమ్మెల్యేల్లో…
  • కోరం కనకయ్య – 2వ స్థానం
  • పాయం వెంకటేశ్వర్లు – 3వ స్థానం
  • అనిల్ జాదవ్ – 4వ స్థానం
  • రాందస్ మాలోత్ – 5వ స్థానం
  • తెల్లం వెంకట్రావు – 6వ స్థానం
  • బాలు నాయక్ నేనావత్ – 7వ స్థానం
  • కోవాలక్ష్మి – 8వ స్థానం
  • రామచంద్ర నాయక్ – 9వ స్థానం
  • వెడ్మ బొజ్జు – 10వ స్థానం

మహిళా ఎమ్మెల్యేల్లో…

  • సబితా ఇంద్రారెడ్డి (బీఆర్ఎస్) – 1వ స్థానం
  • సీతక్క (కాంగ్రెస్) – 2వ స్థానం
  • సునితా లక్ష్మారెడ్డి (బీఆర్ఎస్) – 3వ స్థానం
  • పద్మావతి రెడ్డి (కాంగ్రెస్) – 4వ స్థానం
  • చిట్టం పర్ణికా రెడ్డి (కాంగ్రెస్) – 5వ స్థానం
  • కోవ లక్ష్మి (బీఆర్ఎస్) – 6వ స్థానం
  • కొండా సురేఖ (కాంగ్రెస్) – 7వ స్థానం
  • రాగమయి (కాంగ్రెస్) – 8వ స్థానం
  • మామిడాల యశస్విని (కాంగ్రెస్) – 9వ స్థానం

కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో…

  • మైనంపల్లి రోహిత్ – 10వ స్థానం
  • కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి – 4వ స్థానం
  • విజయ రమణరావు – 6వ స్థానం
  • పొన్నం ప్రభాకర్ – 7వ స్థానం
  • తుమ్మల నాగేశ్వరరావు – 8వ స్థానం
  • సుదర్శన్ రెడ్డి – 9వ స్థానం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలలో‌…
  • సునితా లక్ష్మారెడ్డి – 10వ స్థానం
  • కల్వకుంట్ల సంజయ్ – 6వ స్థానం
  • సబితా ఇంద్రారెడ్డి – 7వ స్థానం
  • మాధవరం కృష్ణారావు – 8వ స్థానం
  • సుధీర్ రెడ్డి – 9వ స్థానం బీజేపీ ఎమ్మెల్యేలలో…
  • పాల్వాయి హరీశ్బాబు – 8వ స్థానం
  • రాజాసింగ్ – 3వ స్థానం
  • రామారావు పవార్ – 4వ స్థానం
  • రాకేశ్ రెడ్డి – 5వ స్థానం
  • మహేశ్వర్ రెడ్డి – 6వ స్థానం
  • ధనపాల్ సూర్యనారాయణ – 7వ స్థానం ఎంఐఎం ఎమ్మెల్యేల్లో…
  • జాఫర్ హుస్సేన్ – 7వ స్థానం
  • అహ్మద్బిన్ అబ్దుల్లా బలాల – 2వ స్థానం
  • మిర్ జుల్ఫీకర్ అలీ – 3వ స్థానం
  • మాజీద్ హుస్సేన్ – 4వ స్థానం
  • కౌసర్ మోహియుద్దీన్ – 5వ స్థానం
  • మహ్మద్ ముబీన్ – 6వ స్థానం
Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *