కటిక నేలపై అప్పల’నాయకుడు’ – పుట్టినరోజు రాత్రి హాస్టల్లో నిద్ర
సహనం వందే, విజయనగరం:విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు తన జన్మదిన వేడుకలను అత్యంత నిరాడంబరంగా జరుపుకుని ఆదర్శంగా నిలిచారు. ఆర్భాటం, ఆడంబరాలకు దూరంగా ఉన్నారు. పూసపాటిరేగ మండలం కొప్పెర్లలో ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థుల మధ్య ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించారు. వారితో పాటు భోజనం చేశారు. అంతేకాక రాత్రి విద్యార్థుల కటిక నేలపైనే నిద్రించడం విశేషం. సేవను ఒక పండుగగా భావిస్తూ పిల్లల నవ్వుల్లో…