- విజయనగరం ఎంపీ కలిశెట్టి స్పెషాలిటీ
- నిరాడంబరతకు నిలువెత్తు నిదర్శనం
సహనం వందే, విజయనగరం:
విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు తన జన్మదిన వేడుకలను అత్యంత నిరాడంబరంగా జరుపుకుని ఆదర్శంగా నిలిచారు. ఆర్భాటం, ఆడంబరాలకు దూరంగా ఉన్నారు. పూసపాటిరేగ మండలం కొప్పెర్లలో ఉన్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థుల మధ్య ఆయన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించారు. వారితో పాటు భోజనం చేశారు. అంతేకాక రాత్రి విద్యార్థుల కటిక నేలపైనే నిద్రించడం విశేషం. సేవను ఒక పండుగగా భావిస్తూ పిల్లల నవ్వుల్లో ఆనందాన్ని వెతుక్కునే అప్పలనాయుడు జీవనశైలి ఎంతో మందికి స్ఫూర్తిదాయకం.

ఆయనతో కలిసి నడిచిన నాయకులు…
ఈ కార్యక్రమంలో ఏపీ స్టేట్ మార్క్ ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, మాజీ ఎంపీపీ చిన్నం నాయుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కంది చంద్రశేఖర్, సువ్వాడ రవి శేఖర్, పూసపాటిరేగ మండల పార్టీ అధ్యక్షులు మహంతి శంకర్ రావు, భోగాపురం మండల పార్టీ అధ్యక్షులు కర్రోతు సత్యనారాయణ, మాజీ జడ్పీటీసీ ఆకిరి ప్రసాద్, డెంకాడ మండల పార్టీ ప్రెసిడెంట్ భాస్కర రావు, జిల్లా అధికార ప్రతినిధి పాణి రాజు, నెల్లిమర్ల నియోజకవర్గం ఏఎంసీ చైర్మన్ ప్రతినిధి గేదెల రాజారావు, సర్పంచుల సంఘం అధ్యక్షులు రౌతు సోము నాయుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సోంబాబు, సన్యాసి నాయుడు, రవికుమార్, సోమ నాయుడు, మైలపల్లి సింహాచలం, మోహన్ రావు పాల్గొన్నారు. నాయకుని నిరాడంబరతకు గురుకులం వేదికైంది.