హైదరాబాద్ ప్రాంతీయ పాస్ పోర్ట్ కార్యాలయంకు జాతీయ అవార్డు

  • జాతీయ అవార్డు అందుకున్న జొన్నలగడ్డ స్నేహజ
  • హైదరాబాద్ పాస్‌పోర్ట్ కార్యాలయం కీలక కార్యక్రమాలు…

సహనం వందే, న్యూఢిల్లీ:
హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ కార్యాలయం (ఆర్‌పీఓ), తెలంగాణ పోలీసులు జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు పొందారు. ప్రస్తుతం న్యూఢిల్లీలో జరుగుతున్న 2025 ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారుల సమావేశంలో…హైదరాబాద్ ఆర్‌పీఓ చేపట్టిన వినూత్న చర్యలు, పౌర-కేంద్రీకృత కార్యక్రమాల విభాగంలో ప్రతిష్టాత్మక జాతీయ అవార్డు గెలుచుకుంది. పాస్‌పోర్ట్ ధృవీకరణ, సేవా సౌకర్యాలలో తెలంగాణ పోలీసుల నిరంతర ప్రతిభకు కూడా ప్రత్యేక ప్రశంసలు దక్కాయి. మంగళవారం నాడు పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా కేంద్ర విదేశాంగశాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గెరిటా ఈ అవార్డులను ప్రదానం చేశారు. హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి జొన్నలగడ్డ స్నేహజ, ఇంటెలిజెన్స్ డైరెక్టర్ జనరల్ బత్తుల శివధర్ రెడ్డి ఈ అవార్డులను అందుకున్నారు.

హైదరాబాద్ ఆర్‌పీఓ కీలక కార్యక్రమాలు…
2024-25లో హైదరాబాద్ ఆర్‌పీఓ అనేక కీలక కార్యక్రమాలను చేపట్టింది. ప్రజలకు మెరుగైన సేవలను అందించడంలో తన నిబద్ధతను చాటుకుంది. ప్రతి గురువారం ప్రజల ఫిర్యాదుల పరిష్కారం కోసం ప్రత్యేకంగా వాక్-ఇన్ సౌకర్యం కల్పించడం, కార్యాలయ ప్రాంగణాన్ని పునరుద్ధరించడానికి పెద్ద ఎత్తున స్వచ్ఛత ప్రచారం చేపట్టడం ఇందులో భాగంగా ఉన్నాయి. భారత రాజ్యాంగం 75 సంవత్సరాలను గుర్తుచేస్తూ ప్రత్యేక స్మారక పాస్‌పోర్ట్ కవర్‌ను విడుదల చేయడంతో పాటు, తెలంగాణ గవర్నర్ తో భారత రాజ్యాంగంపై ఏడాది పొడవునా ఆర్ట్, కాలిగ్రఫీ ప్రదర్శనను కూడా ప్రారంభించారు.

సైబర్ అవగాహన ప్రచారాలు, వైద్య ఆరోగ్య శిబిరాలు, సోషల్ మీడియా ద్వారా ప్రజలతో భాగస్వామ్యం, అవుట్‌రీచ్ డ్రైవ్‌లు, వర్షపు నీటి సంరక్షణ అమలు వంటి పర్యావరణ కార్యక్రమాలు కూడా ఆర్‌పీఓ చేపట్టింది. సాధారణ సేవలకు అపాయింట్‌మెంట్ సైకిల్ 1-10 పని దినాలకు, తత్కాల్ సేవలకు 1-5 పని దినాలకు గణనీయంగా మెరుగుపడింది. ఫిర్యాదులను త్వరగా పరిష్కరించడం, పాస్‌పోర్ట్ సేవా 2.0 చొరవ కింద ఇ-పాస్‌పోర్ట్‌లను ఏకకాలంలో ప్రారంభించడం వంటి చర్యలు కూడా ఈ విజయాలకు దోహదపడ్డాయి.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *