- ఏపీ ఐఏఎస్ అధికారి వివాహేతర సంబంధం
సహనం వందే, హైదరాబాద్:
హైదరాబాద్‌కి చెందిన ఒక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకొని గత కొంతకాలంగా ఆమెతోనే ఎక్కువ సమయం గడిపిన ఏపీకి చెందిన ఓ కీలక ఐఏఎస్ అధికారి వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. గత ఏపీ ప్రభుత్వంలో ఓ కీలక శాఖకు అధిపతిగా పనిచేసిన సదరు అధికారి, తన కుటుంబం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు సమాచారం. అయితే ఇటీవల ఆ ఐఏఎస్ అధికారి వివాహేతర సంబంధంలో చోటు చేసుకున్న అనుమానాలు, కలహాలు ఒక మహిళ ప్రాణాన్ని బలిగొన్నాయని ప్రచారం జరుగుతోంది.
అనుమానంతో ఘర్షణ: మహిళ మృతి
కొద్దిరోజుల క్రితం ఓ వ్యాధితో ఆసుపత్రిలో చికిత్స పొందిన ఐఏఎస్ అధికారికి, తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ వేరే వ్యక్తులతో సన్నిహితంగా ఉంటుందనే అనుమానం బలపడింది. ఈ అనుమానంతో ఇద్దరి మధ్య తీవ్రమైన గొడవలు జరిగాయి. ఆవేశంతో ఆ ఐఏఎస్ అధికారి ఆ మహిళపై దాడి చేయగా ఆమె తల బలమైన దెబ్బతో గోడకు తగిలింది. దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది.
ప్రమాదంగా చిత్రీకరణ, విధులకు హాజరు…
మహిళ మరణంతో కలవరపడిన ఐఏఎస్ అధికారి తన పలుకుబడిని ఉపయోగించి ఆసుపత్రి రికార్డులలో ఈ ఘటనను కప్పిపుచ్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మహిళ మెట్లపై నుండి కింద పడి మరణించినట్లుగా రికార్డులు మార్చాడని చెబుతున్నారు. అనంతరం ఏమీ తెలియనట్లుగా విజయవాడ తిరిగి వెళ్లి తన విధులను యథావిధిగా నిర్వహిస్తున్నట్లు తోటి అధికారులకు తెలిసింది. ఐఏఎస్ అధికారి వ్యవహారం సహచర అధికారులలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. మరిన్ని వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.