- ఇంటికే వైద్యం… సేవే లక్ష్యంగా ముందుకు
- ఆసుపత్రికి వెళ్లకుండానే ఇంటికే డాక్టర్లు
- హైదరాబాదులో ‘ఫ్యామిలీ డాక్టర్’ సేవలు
- వైద్య విప్లవం… కొలువుల జాతర
సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ ప్రజారోగ్య మాజీ సంచాలకులు (డీహెచ్) డాక్టర్ గడల శ్రీనివాసరావు హెల్త్ వ్యాపార రంగంలోకి అడుగుపెడుతున్నారు. ప్రజలకు వైద్య సేవలు చేస్తూనే భారీ బిజినెస్ ప్లాన్ సిద్ధం చేశారు. ప్రజారోగ్య సంచాలకులుగా కరోనా సమయంలో సైనికుడిగా పని చేసిన డాక్టర్ గడల ఇప్పుడు హైదరాబాద్ నగర ప్రజల ఆరోగ్యంపై దృష్టి పెట్టారు. ఆసుపత్రికి రోగి రావడం కాదు… రోగి ఇంటికే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ ను సిద్ధం చేశారు. అందుకోసం వైద్యరంగంలో వివిధ విభాగాల సిబ్బందిని ఆయన నియమించే పనిలో ఉన్నారు.
ఆరోగ్య రంగంలో సరికొత్త మలుపు…
భాగ్యనగరంలో ఆరోగ్య రంగం సరికొత్త మలుపు తిరుగుతోంది. ఆసుపత్రి క్యూలైన్ల తిప్పలు తప్పించేలా ఇంటికే వైద్యం వచ్చేస్తోంది. ఫ్యామిలీ డాక్టర్ పేరుతో సరికొత్త హెల్త్ మోడల్ రూపుదిద్దుకుంది. కేవలం రోగులకు సేవ చేయడమే కాకుండా వందలాది మందికి ఉపాధి కల్పించే బృహత్తర ప్రణాళికతో ఈ సంస్థ ముందుకు సాగుతోంది. మెడికల్ సర్వీస్ రంగంలో ఇది పెను మార్పుగా కనిపిస్తోంది. అందుకోసం డాక్టర్ శ్రీనివాసరావు భారీ ప్రణాళిక రచించారు.

ఇంటింటికీ ఫ్యామిలీ డాక్టర్
హైదరాబాద్ మహానగరంలో వైద్య సేవల తీరు మారుతోంది. ఆసుపత్రికి వెళ్లే ఓపిక లేని వారికి అండగా ఫ్యామిలీ డాక్టర్ నిలుస్తోంది. నేరుగా పేషెంట్ ఇంటికే వెళ్లి చికిత్స చేసే విధానం ఇప్పుడు నగరంలో హాట్ టాపిక్‌గా మారింది. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా అత్యుత్తమ వైద్యం అందించడమే ఈ సంస్థ ప్రధాన ఉద్దేశ్యం. దీనివల్ల వృద్ధులు, అత్యవసర చికిత్స అవసరమైన వారికి ఎంతో మేలు జరుగుతోంది. నగరంలోని ప్రతి గడపకూ క్వాలిటీ హెల్త్ కేర్ అందించేలా ప్రణాళికలు రూపొందించామని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.
కొలువుల జాతర
ఈ వినూత్న వైద్య సేవల్లో భాగంగా భారీ స్థాయిలో నియామకాలు జరుగుతున్నాయి. నిరుద్యోగ వైద్య నిపుణులకు ఇది ఒక అద్భుతమైన అవకాశం. డాక్టర్లు, నర్సులు, ఫిజియోథెరపిస్టుల కోసం సంస్థ వేట మొదలుపెట్టింది. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రాధాన్యత కల్పిస్తున్నారు. కేవలం ఉద్యోగం మాత్రమే కాకుండా సమాజ సేవ చేసే అవకాశం ఇక్కడ లభిస్తోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ దరఖాస్తులను పంపాలని సంస్థ స్పష్టం చేసింది.
డాక్టర్లకు ఆహ్వానం
మెడికల్ రంగంలో నిష్ణాతులైన వైద్యుల కోసం ఫ్యామిలీ డాక్టర్ చూస్తోంది. ఎంబీబీఎస్ లేదా ఎండీ జనరల్ మెడిసిన్ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు. మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా ఉండాలి. ఫ్యామిలీ లేదా జనరల్ ఫిజిషియన్‌గా కనీసం ఒక ఏడాది అనుభవం ఉండాలి. రోగుల పట్ల దయ, అంకితభావంతో పనిచేసే వైద్యులకు ఇక్కడ పెద్దపీట వేస్తున్నారు. ఇంటి వద్దే సేవలు అందించే ఈ కొత్త సంస్కృతిలో భాగస్వాములు కావాలని డాక్టర్ గడల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు.
నర్సింగ్ కేర్
వైద్యులతో పాటు నర్సుల అవసరం ఇక్కడ ఎంతో ఉంది. జీఎన్‌ఎమ్ లేదా బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. నర్సింగ్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ తో పాటు కనీసం 2 ఏళ్ల అనుభవం అడుగుతున్నారు. ఆసుపత్రి వాతావరణం కాకుండా పేషెంట్ ఇంటి వద్దే సేవలు అందించడం వల్ల నర్సులకు సరికొత్త అనుభవం లభిస్తుంది. రోగుల సంరక్షణలో కీలక పాత్ర పోషించే నర్సులకు మంచి గుర్తింపు లభించనుంది. వృత్తి పట్ల గౌరవం ఉన్నవారికి ఇది మంచి వేదిక.
ఫిజియోథెరపీ సేవలు
నగరంలో ఫిజియోథెరపీ సేవల డిమాండ్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బీపీటీ లేదా ఎంపీటీ పూర్తి చేసిన వారిని ఫ్యామిలీ డాక్టర్ ఆహ్వానిస్తోంది. స్టేట్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ కలిగి ఉండి కనీసం ఒక ఏడాది పైగా అనుభవం ఉండాలి. ముఖ్యంగా ఇంటి వద్దే ఉండి చికిత్స పొందే వృద్ధుల సంరక్షణలో అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యత ఇస్తారు. శారీరక ఇబ్బందులతో బాధపడే వారికి ఉపశమనం కలిగించడంలో వీరి పాత్ర కీలకం కానుంది. హోమ్ కేర్ రంగంలో రాణించాలనుకునే వారికి ఇది మంచి ఛాన్స్.
జీతాలు… సౌకర్యాలు
అర్హులైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన నెలవారీ జీతాలు అందిస్తారు. వేతనంతో పాటు అదనపు ఇన్సెంటివ్స్ కూడా ఉండటం విశేషం. దరఖాస్తు చేయాలనుకునే వారు 90009 22422 ఫోన్ నంబర్‌లో సంప్రదించవచ్చు. లేదా మార్కెటింగ్.ఫ్యామిలీడాక్టర్.ఇన్@జిమెయిల్.కామ్ ఈమెయిల్ అడ్రస్ కు వివరాలు పంపాలి. హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు రానున్నాయి. సేవే పరమావధిగా పనిచేసే బృందంతో ఫ్యామిలీ డాక్టర్ ముందుకు కదులుతోంది.