
దిక్కులేని దీనులు… ‘మహా’ విద్యార్థులు – మహావీర్ మెడికల్ కాలేజీలో పరిస్థితి ఘోరం
వికారాబాద్ నుంచి ‘సహనం వందే’ ప్రతినిధి:వికారాబాద్ మహావీర్ మెడికల్ కాలేజీ అనుబంధ ఆసుపత్రిని పరిశీలిస్తే దీనికి ఇన్నాళ్లు ఎలా అనుమతులు వచ్చాయా అన్న అనుమానాలు తలెత్తుతాయి. జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) కళ్ళు మూసుకుని ముడుపులు పుచ్చుకొని బాజాప్తా అనుమతులు ఇచ్చినట్లు అర్థం అవుతుంది. ఈ స్టోరీని చదువుతున్న వాళ్ళు ఎవరైనా ఒక్కసారి అక్కడికి వెళ్లి చూడండి… లేదా ఈ ఆర్టికల్ తోపాటు పెడుతున్న వీడియోలను చూడండి. దానికి అనుమతులు ఇవ్వడం న్యాయమా లేదా మీరే నిర్ణయించండి….