సహనం వందే, ఖమ్మం:
ఖమ్మం జిల్లా సీపీఎం సీనియర్ నాయకులు నర్రా రమేష్ శనివారం తెల్లవారుజామున 2:40 గంటలకు మరణించారు. ఆయన ఎస్ఎఫ్ఐలో చాలాకాలం పనిచేశారు. ఆ తర్వాత పార్టీ ఉద్యమంలో పనిచేశారు. ఆయన భౌతికకాయాన్ని జిల్లా పార్టీ కార్యాలయంలో మధ్యాహ్నం 12 గంటల వరకు సందర్శనార్థం ఉంచుతారు. అనంతరం కాల్వొడ్డు స్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తారు.
సీపీఎం నేత నర్రా రమేష్ మృతి
