సహనం వందే, న్యూయార్క్:
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని న్యూయార్క్ సిటీ ఘనంగా వేడుకలు నిర్వహించింది. ఏప్రిల్ 14వ తేదీని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ డేగా న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ అధికారికంగా ప్రకటించారు. డాక్టర్ అంబేద్కర్ సామాజిక న్యాయం, సమానత్వం కోసం చేసిన కృషిని గౌరవిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆయన పుట్టినరోజును ప్రత్యేకంగా గుర్తించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేయర్ ఎరిక్ ఆడమ్స్ మాట్లాడుతూ, న్యూయార్క్ నగరం భిన్నత్వానికి, అవకాశాలకు నిలయమని, అంబేద్కర్ ఆశయాలు తమ నగర విలువలకు దగ్గరగా ఉన్నాయని తెలిపారు.