ఎవడైతే నాకేంటి?

  • కోమటిరెడ్డిపై ఒక వైద్యాధికారి నోటి దురుసు
  • మంత్రి జోక్యాన్ని సహించలేని ఉన్నతాధికారి

ఆయన రాష్ట్రస్థాయిలో వైద్య ఆరోగ్యశాఖలో కీలక స్థానంలో ఉన్న ఒక అధికారి. జిల్లా వైద్యాధికారులకు దిశా నిర్దేశం చేస్తుంటారు. ఆ అధికారికి నోటి దురుసు ఎక్కువ. ఇటీవల యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన కొందరు వైద్యాధికారులు హైదరాబాదులోని ఆ కీలక అధికారిని కలిశారు. తమ జిల్లా వైద్య ఆరోగ్య అధికారి వైఖరితో విసిగిపోయామని, ఆయన్ను తొలగించాలని… అందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అంగీకారం తెలుపుతూ లేఖ రాశారని తమ బాస్ కు చెప్పుకున్నారు. ఆయన స్థానంలో ఏ అధికారిని పెట్టాలో కూడా నిర్దేశించారని వారు ఆయనకు వివరించారు. దీంతో అగ్గి మీద గుగ్గిలమైన ఆ రాష్ట్ర వైద్య కీలక అధికారి, ‘మంత్రి కోమటిరెడ్డి అయితే నాకేంటి? ఆయనకు వైద్య ఆరోగ్య శాఖకు సంబంధం ఏంటి? ఆయన జిల్లాకు ప్రాతినిత్యం వహించవచ్చు… కానీ ఆయన జోక్యం వైద్య ఆరోగ్యశాఖలో కుదరదు’ అని తీవ్ర పదజాలంతో వ్యాఖ్యానించారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *