టైటానిక్ ఎక్కిన ట్రంప్ – ఎప్‌స్టీన్ తో ట్రంపు విగ్రహం‌ ప్రకంపనలు

Titanic Statue Trump and Epestein
  • వాషింగ్టన్ పార్కులో ఆవిష్కరణతో వివాదం
  • సెక్స్ కుంభకోణంలో పాత్రపై దేశ వ్యాప్త చర్చ
  • అలాగే నరరూప రాక్షసుడిగా ఇరాన్ కార్టూన్
  • ప్రపంచవ్యాప్తంగా సంచలనమైన సంఘటనలు

సహనం వందే, హైదరాబాద్:

అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు రెండు వైపులా చిక్కుకున్నారు. దేశ రాజధానిలో వెలసిన వింత విగ్రహాలు ఒకవైపు… ఇరాన్ వేసిన వ్యంగ్యచిత్రం మరోవైపు ఆయనపై ఒత్తిడి పెంచుతున్నాయి. నేర చరిత్ర కలిగిన ఎప్‌స్టీన్ నీడ ట్రంప్‌ను వెంటాడుతోంది. ఈ పరిణామాలు అంతర్జాతీయ దౌత్యంలో కొత్త మలుపులు తిరుగుతున్నాయి.

Trump and Epstein Statue at Washington Park

విగ్రహాల వెనుక రహస్యం
వాషింగ్టన్ మాల్ పార్కులో వింత విగ్రహాలు వెలుగుచూశాయి. ట్రంప్, ఎప్‌స్టీన్ టైటానిక్ తరహా పోజులో ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. సీక్రెట్ హ్యాండ్ షేక్ అనే బృందం దీనిని రహస్యంగా ఏర్పాటు చేసింది. ఇది కేవలం కళాఖండం మాత్రమే కాదు… బలమైన వ్యంగ్య రాజకీయ సంకేతం. పర్యాటకులు దీనిని ఎంతో ఆసక్తిగా తిలకిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్, ఎప్‌స్టీన్ మధ్య ఉన్న సంబంధాలపై ఇప్పుడు కొత్తగా ప్రశ్నలు మొదలయ్యాయి.

ఎప్‌స్టీన్ చీకటి సామ్రాజ్యం
ఎప్‌స్టీన్ చేసిన నేరాలపై చర్చ మళ్ళీ మొదలైంది. ఆయన ఒక బాలల లైంగిక దోపిడీ ముఠాను నడిపారని ఆరోపణలు ఉన్నాయి. ఎప్‌స్టీన్ నిర్వహించిన వ్యభిచార గృహాలు అత్యంత దారుణమైనవి. ఆయన మరణించినప్పటికీ ఆయన చేసిన నేరాల ఆచూకీ ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారం రేపుతోంది. ఎప్‌స్టీన్ ఒక లైంగిక నేరస్తుడిగా ముద్రపడ్డ వ్యక్తికి ట్రంప్‌కు ఉన్న అనుబంధం ఇప్పుడు మళ్ళీ చర్చకు వచ్చింది.

న్యాయశాఖ రికార్డుల్లో కలకలం
అమెరికా న్యాయశాఖ కొన్ని కీలక రికార్డులను విడుదల చేసింది. ఎప్‌స్టీన్ విచారణకు సంబంధించిన రహస్య సమాచారం అందులో ఉంది. ట్రంప్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు మళ్ళీ తెరపైకి వచ్చాయి. ఎప్‌స్టీన్ కేసులో వెలుగుచూస్తున్న కొత్త విషయాలు ట్రంప్ ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి. ఈ రహస్య కళాకారుల బృందం మరిన్ని ఇలాంటి ప్రదర్శనలు చేసే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.

ఇరాన్ వేసిన కార్టూన్ బాంబు
అంతర్జాతీయ వేదికపై మాటల యుద్ధం ముదిరింది. ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ఒక వ్యంగ్యచిత్రాన్ని విడుదల చేసింది. అందులో ట్రంప్‌ను నరమాంస భక్షకుడిగా చూపిస్తూ ‘నోబెల్ కాన్నిబల్’ అని పేరు పెట్టారు. వెనిజులా ప్రతిపక్ష నాయకురాలి నుంచి ట్రంపు నోబెల్ శాంతి బహుమతిని తీసుకున్న సంగతి తెలిసిందే. శాంతి బహుమతి తీసుకుని రక్తం కళ్ళ చూస్తున్న ట్రంప్ తీరును ఈ కార్టూన్ ఎండగట్టింది. ఇరాన్ మిన్నాబ్ పాఠశాలపై అమెరికా చేసిన దాడిలో 168 మంది చిన్నపిల్లలు చనిపోయిన సంగతి తెలిసిందే. దీన్ని ప్రతిబింబించేలా ఈ కార్టూన్ ఉంది.

Trump Statue in Iran

ప్రమాదకరమైన రాజకీయ వ్యూహాలు
ఎప్‌స్టీన్ పేరుతో గతంలో ట్రంపుపై జరిగిన వ్యక్తిగత దాడి ఇప్పటికే ఆయనను డ్యామేజ్ చేసింది. దానికి ఇప్పుడు విగ్రహం తోడైంది. మరోవైపు పిల్లలపై బాంబు దాడి చేసి అనేకమందిని పొట్టన పెట్టుకున్నారు. ఇది మరింత ప్రమాదకరంగా మారుతోంది.

బొల్లోజు రవి, సీనియర్ జర్నలిస్ట్

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *