గోల్కొండ వజ్రం… ఫ్రాన్స్ రక్తసిక్తం – రత్నం వెనుక శాపం…‌ రక్తపాతం… విప్లవం

  • మ్యూజియంలో గోల్కొండ డైమండ్ భద్రం
  • ప్యారిస్ మ్యూజియంలో దాన్ని తాకని దొంగలు
  • రూ. 500 కోట్ల వజ్రాన్ని పక్కన పెట్టిన వైనం
  • శాపంతో ఎత్తుకెళ్లడానికి భయపడ్డ దొంగలు
  • మ్యూజియంలో ఇతర ఆభరణాలతో పరార్
  • గోల్కొండ గని నుంచి ఫ్రెంచ్ కిరీటం వరకు కథ
  • నెపోలియన్ సామ్రాజ్య పతనం అక్కడి నుంచే

సహనం వందే, పారిస్:
ప్రపంచ ప్రసిద్ధి చెందిన రీజెంట్ వజ్రం చుట్టూ అల్లుకున్న రహస్యాలు… దాని భారతీయ మూలాల శాపం తాజాగా జరిగిన లూవ్ర్ మ్యూజియం దొంగతనంతో మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. కోట్ల విలువైన ఇతర ఆభరణాలను దోచుకెళ్లిన దొంగలు… గోల్కొండ గనుల నుంచి వచ్చిన ఈ రీజెంట్ రాణి వజ్రాన్ని మాత్రం తాకకపోవడం అందరినీ విస్మయానికి గురి చేసింది. చరిత్రలోని ఈ అపురూప వజ్రం కేవలం రత్నం కాదు… రక్తపాతంతో మొదలైన ఒక శాపగ్రస్త కథకు సజీవ సాక్ష్యం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా నది ఒడ్డున ఉన్న కొల్లూరు గనుల్లో లభించిన ఈ వజ్రం… అప్పట్లో మొఘల్ సామ్రాజ్యం కింద గోల్కొండ దుర్గం పరిపాలనా పరిధిలో ఉండేది.

కృష్ణా తీరాన మొదలైన శాపం…
రీజెంట్ వజ్రం కథ మొదలైంది భారత గడ్డపైనే. 1687లో గోల్కొండ దుర్గంపై ఔరంగజేబు దండయాత్ర సమయంలో ఒక గని కార్మికుడు అపారమైన 426 క్యారట్ల రఫ్ వజ్రాన్ని కనుగొన్నాడు. దాన్ని తన కాలులో దాచుకుని దొంగల కళ్లుగప్పి బయటపడ్డాడు. అయితే దురదృష్టం కొద్దీ ఆ కార్మికుడు ఓ ఆంగ్ల వ్యాపారి చేతిలో హత్యకు గురయ్యాడు. ఈ రక్తపాతంతోనే రీజెంట్‌కు శాపం చుట్టుకుందని… దీన్ని సొంతం చేసుకున్నవారికి వినాశనం తప్పదని కథలు ప్రచారంలోకి వచ్చాయి.

రీజెంట్ పేరు వెనుక రహస్యం…
రీజెంట్ డైమండ్ పేరు 1717లో ఫ్రాన్స్‌లో పెట్టారు. అప్పటివరకు పిట్ డైమండ్‌గా పేరొందిన ఈ వజ్రాన్ని మద్రాసు గవర్నర్ థామస్ పిట్ నుంచి ఫ్రాన్స్ రీజెంట్ (ప్రభుత్వ పరిపాలకుడు) ఫిలిప్ ది సెకండ్ ఆఫ్ ఓర్లీన్స్ కొనుగోలు చేశాడు. ఆ సమయంలో రాజు లూయిస్ 15 ఏళ్ల బాలుడు కావడంతో… ఫిలిప్ పాలనా బాధ్యతలు చూసుకునేవాడు. రాజు తరపున పాలన చేసే వ్యక్తిని సూచించే ‘రీజెంట్’ అనే ఫ్రెంచ్ పదం నుంచే ఈ వజ్రానికి రీజెంట్ డైమండ్ అనే పేరు వచ్చింది.

రక్తపాతం… విప్లవాలకు కారణమైన శాపం
కుషన్ ఆకారంలో మెరిసే రీజెంట్ వజ్రం దాని చరిత్రలో అనేక విప్లవాలు, ఉద్యమాలు, రక్తపాతాలకు సాక్ష్యంగా నిలిచింది. ఫ్రెంచ్ రాజ వంశీయులు 16వలూయిస్, మేరీ ఆంటోయినెట్ వంటివారు దీన్ని ధరించినా… ఫ్రెంచ్ విప్లవంలో వారు గిలెటిన్‌కు బలయ్యారు. విప్లవం తర్వాత నెపోలియన్ బోనపార్ట్ దీన్ని తన కత్తిలో ఇమిడించుకున్నాడు. కానీ అతడి సామ్రాజ్యం కూడా కూలిపోయింది. దీన్ని సొంతం చేసుకున్నవారికి వినాశనం తప్పదనే నమ్మకాన్ని ఈ ఘటనలన్నీ బలపరిచాయి.

దొంగలకు శాపం భయం
అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పారిస్‌లోని లూవ్ర్ మ్యూజియంలో ఇటీవల జరిగిన దొంగతనం ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. దొంగలు నెపోలియన్ యుగానికి చెందిన ఎనిమిది అమూల్యమైన ఆభరణాలు… మేరీ అమేలీ సప్ఫైర్ సెట్ వంటి సుమారు మూడు కోట్ల డాలర్ల విలువైన వస్తువులను దోచుకెళ్లారు. అయితే… రూ. 526 కోట్ల విలువ చేసే రీజెంట్ వజ్రాన్ని మాత్రం దొంగలు తాకలేదు. దాని అధిక విలువ తెలిసినా దొంగలు దాన్ని వదిలేయడానికి కారణం దాని భారతీయ మూలాలు, రాజులను సైతం అతలాకుతలం చేసిన శాపంపై ఉన్న భయమేనని నిపుణులు, చరిత్రకారులు బలంగా చెబుతున్నారు. ఈ ఘటన రీజెంట్ వజ్రం శాపం కథను మరోసారి అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశం చేసింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *