సహనం వందే, వనపర్తి:
యూరియా కోసం అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు. కీలకమైన సమయంలో యూరియా అందుబాటులో లేకపోవడంతో అధికారులను నిలదీస్తున్నారు. అందులో భాగంగా శనివారం వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో అన్నదాతలు ప్రాథమిక సహకార సంఘం కార్యాలయం వద్ద అధికారులను నిలదీశారు. వారు స్పందించకపోవడంతో రాళ్లతో దాడి చేశారు. దీంతో అక్కడ తీవ్రమైన ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల రైతులు యూరియా కోసం ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు కొందరు మార్క్ ఫెడ్ అధికారులు దళారులతో కుమ్మక్కై యూరియాను పక్కదారి పట్టిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయినప్పటికీ ఎవరిమీద చర్యలు తీసుకోకపోవడం పట్ల విమర్శలు వస్తున్నాయి.
యూరియా కోసం రైతుల రాళ్ల దాడి
