- బైబిల్ పిచ్చితో బాంబుల రచ్చ
- ప్రార్థనలతోనే యుద్ధం మొదలు
- బాంబు వేయడం దేవుడి ఆజ్ఞట!
- పసిపిల్లల పాఠశాల ధ్వంసంపై సమర్ధన
- అత్యాచార నిందితుడు… దేశ రక్షకుడు హవ్వ!
సహనం వందే, హైదరాబాద్:
మతం మనిషిని మార్చాలి. కానీ ఇక్కడ మతమే మారణాయుధంగా మారింది. తన చేతికున్న పాత కాలపు మత ముద్రలను చూపిస్తూ యుద్ధాన్ని ఒక పవిత్ర కార్యంగా భ్రమపడుతున్న ఒక వ్యక్తి కథ ఇది. ఆ వ్యక్తి తీసుకున్న నిర్ణయాల వల్ల ఇరాన్ దేశంలో పసిపిల్లల రక్తం ఏరులై పారింది. ఇది కేవలం దేశాల మధ్య గొడవ కాదు… ఒక మనిషిలోని మత ఉన్మాదం చేసిన దారుణం.
పసిపిల్లల రక్తపాతం
ఒక పాఠశాల అంటే ఆటపాటలు ఉండాలి. కానీ ఇరాన్ లోని మినాబ్ నగరంలోని స్కూలుపై ఫిబ్రవరి 28న అమెరికా క్షిపణి విరుచుకుపడింది. ఈ దాడిలో 175 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణం వెనుక అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఉన్నాడు. ఈ బాంబులు వేయడం దేవుడి చిత్తమేనని ఆయన నమ్ముతున్నాడు. మనుషులను చంపడం కూడా ఒక ఆశీర్వాదంగా భావించడం కంటే దారుణం మరొకటి ఉండదు.

పాత కాలపు పిచ్చి
పీట్ హెగ్సెత్ వయసు 45 ఏళ్లు. ఆయన గతంలో సైనికుడిగా పనిచేశాడు. ఆయన చేతిపై డేయస్ వల్ట్ అనే లాటిన్ మాటల టాటూ ఉంది. దీని అర్థం దేవుడు కోరుకుంటున్నాడు అని. వెయ్యి ఏళ్ల క్రితం క్రూసేడ్లు అంటే మతం కోసం యుద్ధాలు చేసేవారు ఈ మాటను వాడేవారు. అంటే పీట్ ఇప్పటికీ ఆ పాత కాలపు యుద్ధాలనే ఈ కాలంలో కూడా చేయాలనుకుంటున్నాడు. అందుకే ఆయనను ఒకప్పుడు సైన్యం నుండి తీసేశారు. కానీ ఇప్పుడు ఆయనే రక్షణ మంత్రిగా మారి యుద్ధాన్ని ఉసిగొల్పుతున్నాడు.
దేవుడి పేరుతో దగా…
హెగ్సెత్ నమ్మే మత పద్ధతి చాలా కఠినంగా ఉంటుంది. అక్కడ మనుషులకు సమానత్వం ఉండదు. ఆడవారికి ఓటు హక్కు ఉండకూడదని, తప్పు చేస్తే కఠినంగా శిక్షించాలని వారు నమ్ముతారు. చివరికి బానిసత్వం కూడా మంచిదేనని వాదిస్తారు. ఇలాంటి ఆలోచనలు ఉన్న వ్యక్తి చేతికి అమెరికా రక్షణ బాధ్యతలు చిక్కాయి. ఆయనకు శాంతి అంటే నచ్చదు. కేవలం విధ్వంసం ద్వారానే లోకాన్ని జయించాలని ఆయన కలలు కంటున్నాడు. ఆయన దృష్టిలో ఇరాన్ ప్రజలు మనుషులు కారు.
చీకటి చరిత్ర…
ఈ మంత్రి వ్యక్తిగత జీవితం చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆయనకు రెండుసార్లు విడాకులు అయ్యాయి. మూడో భార్యతో కలిసి ఏడుగురు పిల్లలను పెంచుతున్నాడు. ఒక మహిళపై అత్యాచారం చేశాడనే ఆరోపణ కూడా ఆయనపై ఉంది. ఆ కేసు నుండి బయటపడటానికి ఆయన సుమారు 42 లక్షల రూపాయలు చెల్లించాడు. ఎన్నో ఆరోపణలు, గొడవల వల్ల పాత ఉద్యోగాలు పోయినా డొనాల్డ్ ట్రంప్ మాత్రం ఆయనను మంత్రిని చేశాడు. ఇప్పుడు ఆ పదవిని వాడుకుని ఇరాన్ మీద పగ తీర్చుకుంటున్నాడు.
విఫలమైన వ్యూహం
యుద్ధంలో తాము గెలుస్తున్నామని పీట్ గొప్పలు చెబుతున్నాడు. కానీ అక్కడ పరిస్థితి వేరుగా ఉంది. అమెరికాకు చెందిన ఎఫ్-15 విమానం కూలిపోయింది. దాని వల్ల వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది. ఈ ఓటములను దాచడానికి ఆయన మళ్లీ మతం పేరు వాడుతున్నాడు. కూలిపోయిన విమానం నుండి పైలట్ బతికి వస్తే అది దేవుడు మళ్లీ పుట్టించాడని కథలు చెబుతున్నాడు. అసలు యుద్ధం మొదలుపెట్టిందే తప్పు అని ప్రపంచమంతా అంటున్నా ఆయన మాత్రం బాంబులనే ప్రార్థనలుగా భావిస్తున్నాడు.
శాంతికి దూరం
పీట్ హెగ్సెత్ లాంటి వ్యక్తులు దేశాన్ని పాలిస్తే యుద్ధాలు ఆగవు. ఆయన ప్రజాస్వామ్యాన్ని నమ్మడు. కేవలం తన మతం చెప్పిందే వేదం అనుకుంటాడు. బాంబులు వేయడం వల్ల చనిపోతున్న ప్రాణాల కంటే తన మత గెలుపే ఆయనకు ముఖ్యం. అమెరికా దేశం పుట్టింది అందరికీ స్వేచ్ఛ ఇవ్వడానికి. కానీ ఇప్పుడు అదే దేశం ఒక వ్యక్తి మత పిచ్చి వల్ల యుద్ధంలో కూరుకుపోయింది. ఈ యుద్ధం ఆగేది ఎప్పుడు? ఆ పసిపిల్లల ఆత్మలకు శాంతి కలిగేది ఎప్పుడు?
బొల్లోజు రవి, సీనియర్ జర్నలిస్ట్