ఎంపీ అప్పలనాయుడుకు మోడీ ప్రశంస

  • భుజం తట్టి ‘గాడ్ బ్లెస్ యూ’ అని అభినందన

సహనం వందే, న్యూఢిల్లీ:
విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడును ప్రధాని మోడీ ప్రత్యేకంగా ప్రశంసించారు. కలిశెట్టి పార్లమెంట్ సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరవుతారని, కొత్త విషయాలను అన్వేషించి సమాజానికి మంచి విషయాలను పరిచయం చేస్తారని ప్రధాని కొనియాడారు. ఆయన భుజం తట్టి ‘గాడ్ బ్లెస్ యూ’ అని అభినందించారు. పార్లమెంట్ ప్రాంగణంలో సోమవారం టీడీపీ ఎంపీలు ప్రధాని మోడీతో సమావేశమయ్యారు.

కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ సహా పలువురు ఎంపీలు ఈ భేటీలో పాల్గొన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం తరఫున చేయూత అందిస్తున్నందుకు, అలాగే ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయినందుకు ఎంపీలు ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కొద్దికాలంలోనే ప్రగతి బాట పట్టిందని, కూటమి ప్రభుత్వం వేగంగా అభివృద్ధి పనులు చేస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం ఎల్లప్పుడూ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని ఆయన హామీ ఇచ్చారు.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *