నింగికి నిచ్చెన వేసిన వీరులు – గగన వీరులకు దేశపు గౌరవం
సహనం వందే, న్యూఢిల్లీ: భారత గడ్డపై పుట్టిన బిడ్డలు గగన వీధులు దాటి అంతరిక్షంలో త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేశారు. భూమిపై శత్రువుల గుండెల్లో నిదురపోయే వీరులకు ఇచ్చే అత్యున్నత పురస్కారాలు ఈసారి నింగిని జయించిన వ్యోమగాములకు దక్కాయి. దేశవ్యాప్తంగా గణతంత్ర వేడుకల ఉత్సాహం ఉరకలెత్తుతున్న వేళ… సరిహద్దులు దాటి అనంత విశ్వంలో భారత్ సత్తా చాటిన యోధులను కేంద్ర ప్రభుత్వం సమున్నత గౌరవంతో సత్కరించింది. శుభాన్షు శుక్లాకు అశోక చక్రఅంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన తొలి…