చంద్రబాబు… వైయస్సార్ ల ‘మయసభ’

సహనం వందే, హైదరాబాద్:ఎలాంటి ప్రచారం లేకుండా ఆసక్తికరమైన రాజకీయ చిత్రం రాబోతుంది. పేర్లు చెప్పకపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు, వైయస్ రాజశేఖర్ రెడ్డి రాజకీయ కథతో తెరకెక్కిన చిత్రం ‘మయసభ’. ఇద్దరు స్నేహితులు.. రాజకీయ ప్రత్యర్థులుగా ఎలా మారారనే ఆసక్తికర కథాంశంతో దీన్ని రూపొందించినట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. దర్శకుడు దేవా కట్టా దర్శకత్వంలో ఆది పినిశెట్టి, చైతన్యరావు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం సోనీలివ్ ఒరిజినల్ గా ఇది సిద్ధమైంది. ఆగస్టు 7వ తేదీ నుంచి…

Read More

బాక్సాఫీసు బద్దలు కొడుతున్న స్మర్ఫ్స్ సినిమా

సహనం వందే, హైదరాబాద్: కొన్ని సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా చూసినప్పుడు ఊహించని ఆనందాన్ని పంచుతాయి. స్మర్ఫ్స్ సినిమా అలాంటి అనుభవమే అందిస్తుంది. ఈ రంగురంగుల చిన్న నీలి జీవుల కథాంశంతో రూపొందించిన ఈ చిత్రం చిన్నారులను అమితంగా ఆకర్షించేలా తీర్చిదిద్దారు. సినిమా హాలులో పిల్లలు ఉత్సాహంగా కేకలు వేస్తూ, నవ్వుతూ ఉండటం సినిమా చూసే అనుభవాన్ని మరింత హాస్యమయం, ఉల్లాసభరితం చేసింది. ఈ చిత్రం కేవలం పిల్లల కోసమే కాకుండా కుటుంబ సభ్యులందరూ కలిసి ఆస్వాదించే…

Read More

రేవంత్ రెడ్డితో అజయ్ దేవగణ్ – రాష్ట్రంలో అంతర్జాతీయ స్టూడియో

సహనం వందే, ఢిల్లీ:ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఫిల్మ్ స్టూడియో ఏర్పాటుకు ఆసక్తి కనబరిచారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డితో అజయ్ దేవగణ్ ప్రత్యేకంగా సమావేశమై ఈ అంశంపై చర్చించారు. తెలంగాణలో సినీ నిర్మాణానికి కీలకమైన యానిమేషన్, వీఎఫ్ఎక్స్ స్టూడియోలు, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సదుపాయాలతో కూడిన అంతర్జాతీయ స్థాయి స్టూడియో నిర్మాణానికి అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రిని అజయ్ దేవగణ్ విజ్ఞప్తి చేశారు. నైపుణ్య…

Read More

వెండితెరపై బిచ్చగాడు – రా అండ్ రియలిస్టిక్ ‘దేవా’గా ధనుష్

సహనం వందే, హైదరాబాద్:సినిమా అంటే భావోద్వేగాలను కలిగించే కళ, మనుషులను ఆలోచింపజేసే కథల సౌరభం. సమాజంలో ఒక అంతర్భాగమైనా, వారి జీవితాలను లోతుగా స్పృశించే సినిమాలు చాలా తక్కువ. కానీ చార్లీ చాప్లిన్ లాంటి ప్రపంచ దిగ్గజం నుంచి తమిళ నటుడు ధనుష్ నటించిన ‘కుబేరా’ వరకు బిచ్చగాళ్ల పాత్రలు వెండితెరపై గొప్ప ప్రభావం చూపాయి. వారిలోని మానవత్వం, సామాజిక స్పృహ, పోరాట పటిమను ఈ చిత్రాలు అద్భుతంగా ఆవిష్కరించాయి. చార్లీ చాప్లిన్: ది ట్రాంప్మూకీ సినిమాల…

Read More

‘కుబేర’…. శేఖర్ కమ్ముల సృజనాత్మక విప్లవం

సహనం వందే, సినిమా బ్యూరో, హైదరాబాద్: కొందరు దర్శకులు తమ చిత్రాలతో ప్రేక్షకుల్లో పూర్తిస్థాయి నమ్మకాన్ని కలగజేస్తారు. వారి సినిమా విడుదలవుతోందంటే గుండె ధైర్యంతో థియేటర్లకు వెళ్ళిపోవచ్చు. సుదీర్ఘమైన పాతికేళ్ల సినీ ప్రస్థానంలో ఆయన కేవలం పట్టుమని పది చిత్రాలు మాత్రమే రూపొందించినప్పటికీ, తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పరచుకున్నారు. నాలుగేళ్ళ విరామం తర్వాత, శేఖర్ కమ్ముల కుబేర చిత్రంతో వెండితెరపై తిరిగి మెరిశారు. మరి కుబేర ఎలాంటి అనుభవాన్ని అందించింది? నాగ్, ధనుష్ లాంటి స్టార్…

Read More

థగ్ లైఫ్ ఒక మహత్తర చిత్రం:

ప్రేక్షకులే మా బలం… కమల్ హాసన్! సహనం వందే, విశాఖపట్నం: తెలుగు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో థగ్ లైఫ్ ఒకటి. యూనివర్సల్ హీరో కమల్ హాసన్ ప్రధాన పాత్రలో, లెజెండరీ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ హై-ఓక్టేన్ గ్యాంగ్‌స్టర్ డ్రామా జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. త్రిష, శింబు కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది….

Read More

నాగార్జున, ధనుశ్ నటిస్తోన్న కుబేర టీజర్

సహనం వందే, హైదరాబాద్: నాగార్జున, ధనుశ్ కీలక పాత్రల్లో నటిస్తోన్న చిత్రం కుబేర. ఈ మూవీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ఈ చిత్రం పాన్‌ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది. ఈ మూవీని అమిగోస్‌ క్రియేషన్స్‌తో కలిసి శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ పతాకంపై సునీల్‌ నారంగ్, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదల కావాల్సిన సినిమా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది….

Read More

పవన్ ప్రకంపనలు

సహనం వందే, అమరావతి: తెలుగు సినిమా పరిశ్రమపై పవన్ కళ్యాణ్ ఫైర్ అయ్యారు. సినిమా ఇండస్ట్రీ గౌరవం, మర్యాదలను కాపాడేందుకు తాము ప్రయత్నిస్తుంటే, వారు మాత్రం నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారంటూ ఘాటుగా స్పందించారు. ఈ రిటర్న్ గిఫ్ట్‌ను (థియేటర్ల బంద్) స్వీకరిస్తానని ఆయన హెచ్చరించారు. టాలీవుడ్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కనీస గౌరవం లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటినా సినీ పెద్దలు కనీసం ముఖ్యమంత్రిని కలవలేదని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్…

Read More

’23’: తెరపై దళిత గాథ!

సహనం వందే, హైదరాబాద్: వెండితెరపై కదులుతున్న దృశ్యం కేవలం సినిమా కాదు… అది కాలం చేసిన గాయం! ’23’ అనే అంకె… 1993లో చిలకలూరిపేటలో జరిగిన బస్సు దహన ఘటనలో అసువులు బాసిన 23 మంది అమాయకుల ఆర్తనాదం! జీఆర్ మహర్షి అందించిన కథతో దర్శకుడు రాజ్ ఆర్ రూపొందించిన ఈ చిత్రం… ఆనాటి విషాదాన్ని, నేటి సమాజంలోని అసమానతలను కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది. నేరం చేసిన వారికి శిక్ష పడాలి… కానీ, సమాజంలో అందరికీ న్యాయం…

Read More

నితిన్ ‘తమ్ముడు’

సహనం వందే, సినిమా బ్యూరో, హైదరాబాద్: యువ కథానాయకుడు నితిన్, దర్శకుడు శ్రీరామ్ వేణు కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం తమ్ముడుపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం జులై 4న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రం నుండి మూడ్ ఆఫ్ తమ్ముడు అనే పాత్రల పరిచయ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ వీడియో చిత్ర కథాంశానికి…

Read More