సహనం వందే, హైదరాబాద్:
తెలంగాణ రక్షణ సమితి (డెమోక్రటిక్) (టీఆర్ఎస్ (డి)) పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని, సమస్యలపై పోరాడే మహిళగా గుర్తింపు పొందిన ప్రసన్నను తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా నియమిస్తున్నట్లు ఆ పార్టీ ప్రకటించింది. పరిచయం అవసరం లేని పేరుగా తెలంగాణలో సుపరిచితులైన ప్రసన్న, ఇకపై పార్టీకి దిశానిర్దేశం చేయనున్నారు. ఆమె పోరాట స్ఫూర్తి పార్టీకి మరింత బలాన్ని చేకూరుస్తుందని పార్టీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.
టీఆర్ఎస్ (డి) గౌరవ అధ్యక్షురాలిగా ప్రసన్న
