అందాల పోటీలా? వేశ్యా కేంద్రాలా?

  • మిస్ వరల్డ్ పోటీలపై మిస్ ఇంగ్లాండ్ ఫైర్
  • ధనవంతులను ఆకర్షించాలంటూ ఒత్తిడి
  • బహిష్కరించి సొంత దేశానికి వెళ్లిన తార
  • నైతిక నియమాలకు విరుద్ధమని మండిపాటు
  • లైంగికంగా వేధించినట్లు కూడా ఆరోపణలు
  • ఒక కీలక పార్టీకి చెందిన నాయకుల వేధింపు?
  • హైదరాబాద్ పరువు తీసిన ప్రబుద్ధులు
  • వివాదాల సుడిగుండంలో అందాల పోటీ!

హైదరాబాదులో జరుగుతున్న ప్రపంచ అందాల పోటీలు వివాదాస్పదంగా మారాయి. ఈ పోటీల నిర్వహణపై మిస్ ఇంగ్లాండ్-2024 విజేత మిల్లా మాగీ (24) తీవ్రస్థాయిలో ఆరోపణలు చేయడం సంచలనం అయ్యింది. అంతేకాదు ఈ పోటీలను బహిష్కరించి ఆమె తిరిగి తన దేశానికి వెళ్ళిపోయింది. ‘నేను ఈ ఈవెంట్‌లో వేశ్యలా భావించా. ఎల్లప్పుడూ మేకప్‌లో ఉండాలట. బ్రేక్‌ఫాస్ట్ సమయంలో కూడా బాల్ గౌన్లలో ఉండాలట. అందాల పోటీలను స్పాన్సర్ చేస్తున్న మధ్య వయస్కులైన పురుషులతో సోషలైజ్ (వారితో అన్ని రకాలుగా కలిసిపోవాలని… స్నేహం చేయాలని) కావాలట. దీంతో వారి ముందు మేము కోతుల్లా కూర్చోవాల్సి వచ్చింది. నేను మార్పు తీసుకురావాలని ఇక్కడికి వచ్చాను. కానీ ఈ పోటీలు నా ఆలోచనా తీరుకు… నా నైతిక విలువలకు విరుద్ధం’ అని మిల్లా మాగీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆమె బ్రిటిష్ టాబ్లాయిడ్ పత్రిక ‘ది సన్’ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, తాను ఊహించిన ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ (సామాజిక ప్రయోజనంతో కూడిన అందం) ఉద్దేశాలకు, ఈ పోటీల్లో నెలకొన్న వాతావరణానికి సరిపోలడం లేదని నిప్పులు చెరిగింది. 74 ఏళ్ల మిస్ వరల్డ్ చరిత్రలో పోటీ మధ్యలో నుండి వైదొలిగిన మొదటి సంఘటనగా నిలిచింది. ఆమె ఆరోపణలు అందాల పోటీల నైతికతను నిలదీస్తుంది.

లైంగిక వేధింపులపై సోషల్ మీడియాలో వైరల్..
మిస్ ఇంగ్లాండ్ మిల్లా ఆరోపణలతో పాటు ఆమె విషయంలో మరికొన్ని అంశాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె నిర్ణయం వెనుక గల కారణాలపై అనేక ఊహాగానాలు చెలరేగుతున్నాయి. రాష్ట్రంలో ఒక కీలక పార్టీకి చెందిన నాయకుల లైంగిక వేధింపులు ఆమె నిష్క్రమణకు కారణమని కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ ఆరోపణలు ఇంకా అధికారికంగా నిర్ధారణ కాలేదు. ఈ ఆరోపణలే నిజమైతే ఆ పార్టీకి చెందిన నాయకులు హైదరాబాద్ పరువును అంతర్జాతీయ స్థాయిలో తలదించుకునేలా చేస్తుంది. రామప్ప దేవాలయం సందర్భంగా పోటీదారుల కాళ్లు కడగడం కూడా సోషల్ మీడియాలో తీవ్ర వివాదాన్ని రేకెత్తించింది.

‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ నినాదం వెనుక వివాదం…
మిస్ వరల్డ్ పోటీ 1951లో యూకేలో ఎరిక్ మోర్లీ ఆధ్వర్యంలో ప్రారంభమైంది. మొదట ఫెస్టివల్ ఆఫ్ బ్రిటన్‌లో భాగంగా బికినీ పోటీగా మొదలైన ఇది, క్రమంగా వార్షిక అంతర్జాతీయ అందాల పోటీగా రూపాంతరం చెందింది. 1951లో స్వీడన్‌కు చెందిన కికీ హకాన్సన్ తొలి మిస్ వరల్డ్‌గా బికినీలో కిరీటం ధరించడం అప్పట్లో తీవ్ర వివాదానికి దారితీసింది.1980వ దశకంలో ‘బ్యూటీ విత్ ఎ పర్పస్’ అనే నినాదంతో వివాదాలను సద్దుమణిగేలా చేశారు. 1970లో లండన్‌లో జరిగిన ఈవెంట్‌లో ఫెమినిస్ట్ నిరసనకారులు ఫ్లోర్ బాంబులను విసిరి కలకలం రేపారు. 2002లో నైజీరియాలోని అబుజాలో జరగాల్సిన పోటీ, అక్కడి షరియా చట్టాల కారణంగా వివాదంలో చిక్కుకుని యూకేకి మార్చారు. 1973లో విజేత మార్జోరీ వాలెస్‌ను తన బాధ్యతలను నెరవేర్చలేకపోయిందనే కారణంతో తొలగించగా, 1980లో గాబ్రియెల్లా బ్రమ్ నిరసనతో తన కిరీటాన్ని వెనక్కు ఇచ్చేసింది.

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *