నర్సింగ్ విద్యార్థినిపై యాసిడ్ దాడి

Acid Attack at Warangal

సహనం వందే, వరంగల్:
నర్సింగ్ విద్యార్థినిపై మంగళవారం ముగ్గురు దుండగులు యాసిడ్ దాడి చేసి పరారయ్యారు. హనుమకొండలోని కాలేజీ నుంచి ద్విచక్ర వాహనంపై అమ్మమ్మ ఇంటికి వెళ్తున్న ఆమెపై హెల్మెట్లు ధరించిన దుండగులు యాసిడ్ చల్లారు. ఈ దాడిలో విద్యార్థినికి నడుము, ఎడమ కాలిపై గాయాలయ్యాయి. ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఈ వార్త ఎన్డీటీవీ సోర్స్: https://www.ndtv.com/india-news/telangana-nursing-student-attacked-with-chemical-substance-suffers-injuries-9734317

Share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *